కడుపు నిండుతుంది | Good food | Sakshi
Sakshi News home page

కడుపు నిండుతుంది

May 7 2018 12:59 AM | Updated on May 7 2018 12:59 AM

Good food  - Sakshi

చూడటానికి అచ్చం మెదడు షేపులో కనిపించే వాల్‌నట్‌తో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అపరిమితం. ఈ డ్రైఫ్రూట్‌ మెదడుకు చాలా మంచిది. వీటితో కలిగే ప్రయోజనాల్లో ఇవి కొన్ని.
♦ వాల్‌నట్‌లో చాలా శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. వాటికి తోడు అందులోని ఫీనాలిక్‌ కాంపౌండ్లు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్, గామా–టోకోఫెరాల్‌ వంటివి క్యాన్సర్‌ కణాలను చాలా బలంగా తుదముట్టిస్తాయి. రొమ్ము, ప్రోస్టేట్, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్ల వంటి ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
♦ వాల్‌నట్స్‌లోని లినోలిక్‌ యాసిడ్, ఆల్ఫాలినోలిక్‌ యాసిడ్, ఆరాకిడోనిక్‌ యాసిడ్స్‌ వంటివి గుండెజబ్బులను (కరోనరీ హార్ట్‌ డిసీజ్‌) నివారిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచికొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దాంతో రక్తనాళాలలో పూడిక ఏర్పడే ముప్పును నివారితమవుతుంది.
♦ రోజుకు మూడు లేదా నాలుగు వాల్‌నట్స్‌ తినేవారికి రక్తపోటు (హైబీపీ) ముప్పు చాలా తక్కువ. ఇది నిర్ధారణ అయిన ఫలితం.
♦ వాల్‌నట్స్‌ కొద్దిగా తినగానే వెంటనే సంతృప్తభావన కలుగుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి వాల్‌నట్స్‌ చాలా మేలు చేస్తాయి.
♦  వాల్‌నట్స్‌లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ మెదడుకు చాలా మేలు చేస్తాయి. అవి అయోడిన్, సెలినియమ్‌లతో కలిసి మెదడును చురుగ్గా ఉంచేలా చూస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచి మతిమరపును తగ్గిస్తాయి. మూర్చతో బాధపడేవారికి వాల్‌నట్స్‌ చాలా మంచివి.
♦ ఇవి డయాబెటిస్‌ను చాలా సమర్థంగా నియంత్రిస్తాయి. బరువు తగ్గించడం ద్వారా కూడా ఇవి డయాబెటిస్‌ ముప్పును తగ్గిస్తాయి.
♦ ఎముకలలోకి క్యాల్షియమ్‌ను సమర్థంగా ఇంకేలా చేస్తాయి. అలా ఇవి ఎముకల పటిష్టతకూ ఉపకరిస్తాయి.
♦  గర్భవతులకు ఇవెంతో మేలు చేస్తాయి. పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి.
♦ నిద్రను క్రమబద్దీకరిస్తాయి. నిద్రలేమి, కలత నిద్రతో బాధపడేవారు రాత్రి భోజనం తర్వాత కొన్ని వాల్‌నట్స్‌ తీసుకుంటే మంచి నిద్రపడుతుంది.
♦ వాల్‌నట్స్‌ ఏజింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచేలా తోడ్పతయాయి. చర్మం మీది ముడుతలను నివారిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement