స్టేషన్‌కో టేస్ట్‌ | giving you a list of any food items in the railway station | Sakshi
Sakshi News home page

స్టేషన్‌కో టేస్ట్‌

Apr 4 2018 12:09 AM | Updated on Apr 4 2018 12:09 AM

 giving you a list of any food items in the railway station - Sakshi

ఆగండి ఆస్వాదించండి
జీవితం ఎప్పుడు సంతృప్తికరంగా ఉంటుంది. మామూలుగానైతే రుచికరమైన భోజనం దొరికినప్పుడు. అదే భోజనం లేదా ఇంకేదైనా టేస్టీ ఫుడ్‌ను ప్రయాణం చేస్తూ మధ్య మధ్య రైల్వేస్టేషన్‌లలో దిగి తింటే? జీవితంలోని సంతృప్తికి ఆహ్లాదం కూడా తోడవుతుంది. సాధారణంగా ప్రదేశాలు చూడ్డానికి ప్రయాణాలు చేస్తాం. వీలైతే ఒకసారి మీరెప్పుడైనా కేవలం ఫుడ్‌ని తినడానికే జర్నీ చెయ్యండి. ఎక్కడికి అంటారా? ఇదిగో మెనూ. ఏ రైల్వే స్టేషన్‌లో ఏ ఫుడ్‌ ఐటమ్‌ అదిరిపోతుందో లిస్ట్‌ ఇస్తున్నాం. టిక్‌ పెట్టడం, టికెట్‌ బుక్‌ చేసుకోవడం మీ వంతు.

కర్జాత్, మహారాష్ట్ర 
వడాపావ్, బటాటా వడ. ఆ ఘుమఘుమలు ఎంత నోరూరిస్తాయో చెప్పలేం. 

నసీరాబాద్, రాజస్తాన్‌
కచోరా. జెయింట్‌ కచోరా తీస్కోండి. క్రంచీగా, డెలీషియస్‌గా లాగించేయండి. 

సురేంద్రనగర్, గుజరాత్‌
కామెల్‌ మిల్క్‌ టీ. ఒంటె పాల తేనీరు! లైఫ్‌లో ఒక్క సిప్‌ అయినా వెయ్యాల్సిందే. 

మద్దూర్, కర్ణాటక
మద్దూర్‌ వడ. చూడ్డానికి కుకీస్‌లా ఉంటాయి ఈ వడలు. ఒకటి తిని చూడండి. ఇంకోటి తినకుండా ఆగగలరేమో.. అదీ చూడండి. 

కాలికట్, కేరళ
కోళికోడ్‌ హల్వా. కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, లోకల్‌ సుగంధ ద్రవ్యాలతో తయారయ్యే ఈ హల్వా మీకు ఈ భూమ్మీద ఇక్కడ కాక మరెక్కడా దొరకదు. 

హౌరా, పశ్చిమ బెంగాల్‌
చికెన్‌ కట్‌లెట్‌. చిన్నవిగా ఉంటాయి. కరకరలాడతాయి. ఎంపిక చేసిన లేత చికెన్‌తో చేస్తారు కాబట్టి పీచు మిఠాయిల్లా నోట్లో కరిగిపోతాయి. 

విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
దాల్‌ వడ. లోపల, బయట కూడా మృదువుగా ఉంటుంది. చట్నీ ఇస్తారు. ఉల్లిపాయ ముక్కలు వేస్తారు. కొరుక్కోడానికి ఒక మిరపకాయను కూడా పెడతారు. తింటే స్వర్గలోకాల వీక్షణే. 

తండ్లా, యు.పి.
ఆలూ టిక్కీ. వేడి వేడిగా, క్రిస్పీగా ఉంటాయి. అయితే ట్రైన్‌ ఇక్కడ ఎంతోసేపు ఆగదు. ఆలోపే కుమ్మేయాలి మరి. 

జలంధర్, పంజాబ్‌
చోళే భతూరే. ఈ రూట్‌లో వెళ్తున్నప్పుడు ఈ స్టేషన్‌లో దిగి, ఈ ఐటమ్‌ను తినకపోతే.. మీరిక ప్రపంచమంతా తిరిగినా వృథానే. ప్రయాణం వృథా అని కాదు. లైఫ్‌ వృథా అని. 

రత్లామ్, ఎం.పి.
పోహ. ఉల్లిపాయలు తరిగి, ఫ్రెష్‌గా సర్వ్‌ చేస్తారు. చవక, ఆరోగ్యం కూడా. బ్రేక్‌ఫాస్ట్‌కి సూట్‌ అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement