సేంద్రియ సేద్యంపై నెల రోజుల ఉచిత సర్టిఫికెట్‌ కోర్సు | Sakshi
Sakshi News home page

సేంద్రియ సేద్యంపై నెల రోజుల ఉచిత సర్టిఫికెట్‌ కోర్సు

Published Tue, Feb 19 2019 2:53 AM

Free Certificate Course on Organic Farming - Sakshi

కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్‌.సి.ఒ.ఎఫ్‌.), జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్‌) సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు సేంద్రియ సేద్యంలో మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 5 వరకు రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ కోర్సును నిర్వహించనున్నట్లు ఎన్‌.సి.ఒ.ఎఫ్‌ శాస్త్రవేత్త డా. వి. ప్రవీణ్‌ తెలిపారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని మేనేజ్‌లో ఈ కోర్సును నిర్వహిస్తారు. శిక్షణ, భోజన, వసతులు ఉచితం. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన గ్రామీణ స్త్రీలు, పురుషులు అర్హులు. వయోపరిమితి లేదు. మొత్తం 30 సీట్లలో 4 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 8 ఓబీసీలకు, మైనారిటీలకు ఒకటి కేటాయించారు. 20 రోజులు పాఠాలు నేర్చుకొని, 10 రోజులు పొలంలో పనిచేయాలి. ఈ క్రింది వెబ్‌సైట్‌లో నుంచి దరఖాస్తు నమూనాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormFor Training.pdf  నింపిన దరఖాస్తును స్కాన్‌ చేసి కోర్సు ప్రారంభానికి కనీసం 7 పనిదినాల ముందే  praveenvootla85@gmail.com కు మెయిల్‌ చెయ్యాలి. కోర్సు సమన్వయకర్త డా.ప్రవీణ్‌కుమార్‌ను 92478 09764 నంబరులో వాట్సాప్‌ ద్వారా సంప్రదించవచ్చు.


24న భీమవరం, తణుకులో డా. ఖాదర్‌ వలి ప్రసంగాలు
ప.గో. జిల్లా భీమవరం, తణుకులో ఈ నెల 24 (ఆదివా రం)న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగించనున్నారు. భీమవరంలోని ఎ.ఎస్‌.ఆర్‌. నగర్‌లోని శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో 24న ఉ. 9 గం. నుంచి మ. 1 గం. వరకు డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగిస్తారని నిర్వాహకులు లయన్‌ డాక్టర్‌ పి. బి. ప్రతాప్‌కుమార్‌(94401 24253), సుబ్రహ్మణ్యం రాజు(76598 55588) తెలిపారు. తణుకులోని జెడ్పీ బాయ్స్‌ హైస్కూల్‌ ఆవరణ(గవర్నమెంటు హాస్పిటల్‌ పక్కన, మెయిన్‌ రోడ్డు)లో 24వ తేదీ సా. 4.30 గం. నుంచి రా. 7 గం. వరకు జరిగే ఈ సదస్సులో డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 70939 73999, 98493 12629. 

23న కరీంనగర్‌లోసేంద్రియ రైతు సమ్మేళనం
జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్‌.సి.ఓ.ఎఫ్‌.) ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌ (కలెక్టరేట్‌ ఎదురుగా)లో ఈ నెల 23 (శనివారం) ఉ. 9 గం. నుంచి సా. 5 గం. వరకు సేంద్రియ రైతు సమ్మేళనం జరగనుంది. వేస్ట్‌ డీ కంపోజర్‌తో సేంద్రియ సేద్యం, పీజీఎస్‌ ఇండియా సర్టిఫికేషన్, మార్కెట్‌ అనుసంధానంపై ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. డైరెక్టర్‌ డా. కృష్ణచంద్ర, శాస్త్రవేత్త డా. ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తారని విశ్రాంత జె.డి.ఎ. జనార్దన్‌రావు తెలిపారు. వివరాలకు.. 93969 69217, 84640 09350

కట్టె గానుగల నిర్వహణపై 3 రోజుల శిక్షణ
సహజ సాగు పద్ధతిలో పండించిన నూనెగింజలతో ఎటువంటి రసాయనాల్లేకుండా కట్టె గానుగలో వంట నూనెలను వెలికితీయడంపై యువతీ యువకులకు మార్చి 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్‌ ఏ.ఎస్‌.రావు నగర్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు షిండె శివశంకర్‌ తెలిపారు.  కనీసం పదో తరగతి చదివిన 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. వివరాలను ఈ నెల 25లోగా 81210 08002, 70133 09949లలో ఏదో ఒక నంబర్‌కు ఎస్‌.ఎం.ఎస్‌./వాట్సప్‌ ద్వారా సమాచారం పంపాలన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement