ఫస్టఫాల్‌.. ముందసలు! | fighting on Twitter | Sakshi
Sakshi News home page

ఫస్టఫాల్‌.. ముందసలు!

Oct 26 2017 11:24 PM | Updated on Aug 10 2018 8:31 PM

fighting on Twitter - Sakshi

ట్విట్టర్‌లో రోజూ ఏదో ఒక కొట్లాట, తిట్లాట ఉండేదే! చిదంబరానికి మోదీ మీద కోపం వస్తే ట్విట్టర్‌లోకి వెళ్లి ‘కుహూ’ అంటాడు రామ్‌గోపాల్‌ వర్మకు టీడీపీ వాళ్లపై కోపం వస్తే ఆ ట్విట్టర్‌లోకే వెళ్లిపోయి ‘క్యా బే’ అంటాడు. ట్విట్టర్‌లో అంతా ఫైట్‌ మాస్టర్లేనా? పీటర్‌ హేన్స్‌లేనా! కాదు, కొన్ని కూల్‌ పిట్టలూ వచ్చి వాలుతుంటాయి. రెండు మూడు రోజులగా కొన్ని పిట్టలు ‘ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌’ అనే కొమ్మను పట్టుకుని ఎగురుతున్నాయి. ఇవన్నీ నెటిజన్‌ల జోక్స్‌. రెండు లైన్‌ల జోక్స్‌. వాటిల్లో వైరల్‌ అయిన జోక్‌ ట్వీట్స్‌ ఇవి. ఎంజాయ్‌ చెయ్యండి.

హ్యాపీ జర్నీ. కిటికీలోంచి బయటికి చేతులు పెట్టకు.
ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌.. నేను ఫ్లైట్‌లో వెళ్తున్నా.

నీకేది ఇష్టమో అందులో డిగ్రీ చెయ్యి.
ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ నేను ఇండియన్‌.

నా మెసేజ్‌లకు రిప్లై ఎందుకు ఇవ్వడం లేదు?
ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌... నువ్వెవరో నాకు తెలీదు!

హేయ్, ఐ లవ్‌ యు.
ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌.. అది నా ప్రాబ్లం కాదు.

Advertisement
 
Advertisement
Advertisement