దివ్వెకువెలుగు | Sakshi
Sakshi News home page

దివ్వెకువెలుగు

Published Sat, Oct 26 2019 2:06 AM

Festival Of Diwali Should Be Decorated With Lights - Sakshi

దీపాల పండగకు దివ్వె వెలుగులు విరజిమ్ముతుంది. మరి ఆ దివ్వెకే వెలుగులు అద్దితే.. ఆ వెలుగు మరింత కళగా, కాంతిని విరబూస్తుంది. దీనికి ఎంతో ఖర్చు అక్కర్లేదు. ఇంట్లో ఏదో సందర్భంలో కొని వాడకుండా పక్కన పెట్టేసిన పూసలు, లేసులు, కలర్స్‌తో ప్రమిదలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

►మట్టి ప్రమిదలు, చిన్న చిన్న కుండలు, మట్టి ప్లేటు, పెయింట్, పూసలు, చమ్కీలు, లేస్, గ్లూ... తీసుకోవాలి.

►ప్రమిదలకు, ప్లేట్‌కు లోపలి వైపు ఒక రంగు, బయటి వైపు ఒక రంగు వేయాలి. ఆరిన తర్వాత లేస్‌ లేదా పూసల దండను గ్లూ సాయంతో ప్రమిదలకు, కుండలకు చుట్టూ అతికించాలి.

►ప్లేటులో కుండలను వరసగా పెట్టి, వాటి ముందు అలంకరించిన దివ్వెను అతికించాలి. ప్రమిదలకు అద్దాలు, చమ్కీలను కూడా అతికించవచ్చు. ఇలా అందమైన రూపాల్లో దివ్వెను నచ్చిన డిజైన్లలో అలంకరించుకోవచ్చు.

Advertisement
Advertisement