వణకే చలి... వ్యాయామం భళీ... | Sakshi
Sakshi News home page

వణకే చలి... వ్యాయామం భళీ...

Published Thu, Nov 16 2017 12:57 AM

Exercise comes in agility - Sakshi

అన్ని కాలాల్లోకి చలికాలం వ్యాయామ ప్రియులకు అత్యంత అనుకూలం. రెగ్యులర్‌గా చేసే వాళ్లకు మాత్రమే కాదు ప్రారంభించాలనుకునేవారికి కూడా సరైన సీజన్‌ ఇది.బెస్ట్‌... ఎందుకంటే... ఈ సీజన్‌లో అలసట త్వరగా రాదు చెమట తక్కువగా పడుతుంది. కాబట్టి మరింత ఎక్కువ సేపు వర్కవుట్‌ చేయవచ్చు. మన అత్యున్నత శారీరక సమర్ధత ఎంతో తెలుసుకోవాలంటే ఈ సీజన్‌ కరెక్ట్‌. మన దేహం ఎపుడూ నిర్ణీత వేడిని(37డిగ్రీల టెంపరేచర్‌ లేదా 98.4 ఫారెన్‌ హీట్‌) ఉంచుకుంటోంది. ఈ సీజన్‌లో శరీరానికి కావాల్సినంత వేడి అందదు కాబట్టి, వ్యాయామం చేస్తే చురుకుతనం వస్తుంది. జాయింట్‌ పెయిన్స్‌ ఉన్నవారికి ఈ సీజన్‌లో వ్యాయామం మరింత ఉపకరిస్తుంది.

సీజనల్‌.. కేర్‌...
శరీరంలో మజిల్స్‌ స్టిఫ్‌గా ఉంటాయి కాబట్టి వార్మప్‌ లేకుండా చేస్తే తీవ్రమైన నొప్పులు రావచ్చు. ఏ తరహా వ్యాయామానికి ముందు అయినా వార్మప్‌ తప్పకుండా చేయాలి. ఎప్పుడూ చేసే కంటే కాస్త ఎక్కువ సమయం వార్మప్‌కి కేటాయించాలి. సూర్యుని వెలుగు సరిపడా సోకకపోవడం మనకు తెలియని డిప్రెషన్‌కు దోహదం చేస్తుంది. కాబట్టి సూర్యోదయం అయ్యాకే వర్కవుట్‌ చేయడం బెటర్‌. దీనివల్ల దేహం త్వరగా వార్మప్‌ అవుతుంది. స్టిఫ్‌నెస్‌ తగ్గుతుంది.

రైట్‌... వర్కవుట్‌ ఇదీ...
వెయిట్స్‌తో చేసే స్ట్రెంగ్త్‌ ట్రయినింగ్, లేదా స్విమ్మింగ్‌  ఈ సీజన్‌లో పెద్దగా ప్రయోజనకారి కాదు. బ్రిస్క్‌వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్‌ లాంటి ఎరోబిక్‌ వ్యాయామాలు ఉపయుక్తం.  చలికి చిక్కకూడదనుకుంటే ఫ్లోర్‌ మీద చేసే సిటప్స్, పుషప్స్, స్క్వాట్స్, లంజెస్, ఛెయిర్‌ డిప్స్‌... వంటివి ఎంచుకోవాలి. డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్టెప్‌–అప్స్,  ఇంట్లోనే లెక్కపెట్టుకుని మెట్లు ఎక్కి దిగడం, క్లీనింగ్‌ లేదా గార్డెనింగ్‌... చేయాలి. వ్యాయామ సమయంలో నోటితో కన్నా ముక్కుతో గాలి పీల్చడమే శ్రేయస్కరం. నోటితో పీలిస్తే చలిగాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి పోతుంది. శ్వాససంబంధ ఇబ్బందులను సృష్టిస్తుంది.  

డాక్టర్‌ రామకృష్ణ
ఆర్థోపెడిక్, జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌
ప్రతిమా ఆసుపత్రి(హైదరాబాద్‌)

Advertisement
Advertisement