రారండోయ్‌ 

Events In Hyderabad - Sakshi
  • ‘హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018(పుస్తక ప్రదర్శన) తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్‌ స్టేడియం) లో ఏప్రిల్‌ 13 నుంచి 22 వరకు జరగనుంది.
  • తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా ‘కావ్య పరిమళం’ శీర్షిక క్రమంలో ఏప్రిల్‌ 13న సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో పాల్కురికి సోమనాథుని బసవ పురాణంపై డాక్టర్‌ అనుమాండ్ల భూమయ్య ప్రసంగిస్తారు. అధ్యక్షుడు నందిని సిధారెడ్డి.
  • తంగెళ్లపల్లి కనకాచారి కవితా సంకలనం ‘కుదుపు’ ఆవిష్కరణ ఏప్రిల్‌ 15న ఉదయం 10 గంటలకు వట్టికోట ఆళ్వారుస్వామి నగర కేంద్ర గ్రంథాలయం, చిక్కడపల్లిలో జరగనుంది.
  • పాలమూరు సాహితీ అవార్డు కోసం 2017లో వచ్చిన వచన కవితా సంపుటాల మూడేసి ప్రతులను ఏప్రిల్‌ 30 లోగా పంపాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిరునామా: డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్, 8–5–38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌నగర్‌–509001. వివరాలకు: 9032844017
  • ‘సోమనాథ కళా పీఠం’ 2018 ద్వైవార్షిక పురస్కారాలకుగానూ ఏప్రిల్‌ 30లోగా ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నారు. పాలకురికి సోమనాథుని జీవిత సాహిత్యాలపై పరిశోధన చేసినవారు ‘సోమనాథ సాహిత్య పురస్కారం’, సోమనాథుని భావజాలంపై కృషి చేసినవారు ‘సోమనాథ సామాజిక శోధన పురస్కారం’, నాటక రంగమున సాధన చేసినవారు ‘సోమనాథ రంగస్థల పురస్కారం’, తెలుగు భాషా సాహిత్యములకు సేవ చేసినవారు ‘పందిళ్ల శేఖర్‌ బాబు రాజయ్య శాస్త్రి స్మారక పురస్కారం’, సాహిత్య రసాస్వాదనకు కృషి చేస్తున్న కోవిదులు ‘వి.చలపతి రావు స్మారక పురస్కారం’ కోసం ‘డాక్టర్‌ రాపోలు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు, సోమనాథ కళాపీఠం, పాలకుర్తి – 506146, జనగామ, ఫోన్‌: 9440163211’ చిరునామాకు పంపవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top