కోడిగుడ్లు ఎక్కువైనా.. గుండెకు ఇబ్బంది లేదు! 

Eggs do not bother higher heart - Sakshi

పరి పరిశోధన

వారానికి 12 చొప్పున ఏడాది పొడవునా కోడిగుడ్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది లేదని సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెతోపాటు మధుమేహం వంటి వ్యాధుల విషయంలోనూ కోడిగుడ్ల ప్రభావం పెద్దగా లేదని వీరు అంటున్నారు. మూడు నెలలపాటు కోడిగుడ్లు ఎక్కువగా తిన్నా ఆరోగ్యంపై ప్రభావం ఉండదని గతంలోనే నిరూపణ అయినప్పటికీ తాజా పరిశోధనలు ఈ కాలాన్ని ఏడాదికి పెంచడం గమనార్హం. వారానికి రెండు గుడ్లు మాత్రమే తినేవారితోపాటు 12 గుడ్లు తినే వారిని కొంత కాలంపాటు పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని గుండెజబ్బుల విషయంలో రెండు గుంపుల్లోని వారి స్థాయి ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని నిక్‌ ఫుల్లర్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

ముందుగా తాము మూడు నెలలు ఆ తరువాత ఇంకో మూడు నెలలు ఈ తరహా ఆహారం ఇచ్చి పరిశీలనలు జరిపామని, ప్రతి దశలోనూ భాగస్వాముల్లో గుండె జబ్బులకు సంబంధించిన ఏ వ్యతిరేక లక్షణమూ కనిపించలేదని వివరించారు. సంతృప్త కొవ్వుల స్థానంలో మోనోశ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు ఆరోగ్యానికి మేలన్నది గుర్తుంచుకుంటే చాలని కోడిగుడ్లు ఎక్కువ తిన్నా గుండెజబ్బుల ప్రమాదం తక్కువని తమ ప్రయోగం స్పష్టం చేస్తోందని ఆయన వివరించారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top