రెడ్‌ వైన్‌ తాగుతున్నారా.. ఐతే జాగ్రత్త

Doctors Says Red Wine Could Be the Worst Drink For Your Skin - Sakshi

రెడ్‌ వైన్‌ను ఇష్టంగా తాగేవారు..  ఇకపై కాస్త జాగ్రత్తగా ఉండండి.. వీలైతే తాగడం పూర్తిగా మానేయండి.. ఇవి మేము చెప్తున్న మాటలు కాదండోయ్‌.. పరిశోధనలు చేసి వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు. అధిక మోతాదులో రెడ్‌ వైన్‌ తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, హృద్రోగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఈ మేరకు తన పరిశోధనల్లో పలు విషయాలు వెల్లడయ్యాయంటూ డాక్టర్‌ మార్క్‌ మెనోలాసినో ఇక ఆర్టికల్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా శుద్థిచేయని, చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షరసం తాగటం వల్ల కాలేయం దెబ్బతింటుందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా పేర్కొన్నారు.  

చర్మవ్యాధులు కూడా..
రెడ్‌ వైన్‌ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల మొటిమలు వస్తాయని, చర్మం కళ కోల్పోతుందని డాక్టర్‌ ఇసాబెల్‌ షార్కర్‌ తెలిపారు. కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. మొటిమలు, చర్మంపై గల మృత కణాల వల్ల రంధ్రాలు ఏర్పడతాయి గనుక సాధ్యమైనంత వరకు రెడ్‌ వైన్‌ను తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మేము చెప్పాల్సింది చెప్పాం.. సో ఇకపై రెడ్‌ వైన్‌ తాగుతారో మానేస్తారో మీ ఇష్టం మరి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top