బంగారు నానోకణాలతో  వ్యాధి నిర్థారణ చవక

Diagnosis of the disease with golden nano cells is cheap - Sakshi

కేన్సర్‌ వ్యాధి నిర్ధారణకు చవకైన కొత్త పద్ధతి ఒకదాన్ని అభివృద్ధి చేశారు క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఒకట్రెండు రకాలకు కాకుండా అన్ని రకాల కేన్సర్లకూ ఈ పద్ధతిని ఉపయోగించగలగడం ఇంకో విశేషం. కేన్సర్‌ నిర్ధారణకు చౌకైన, మెరుగైన పద్ధతిని ఆవిష్కరించేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు జరుగుతుండగా అన్ని రకాల కేన్సర్లను ఒకే పద్ధతితో గుర్తించడం మాత్రం ఇప్పటివరకూ వీలు కాలేదు. ఈ నేపథ్యంలో తాము కేన్సర్‌ కణాల డీఎన్‌ఏ పోగులపై ప్రత్యేకదృష్టి పెట్టామని అందులోని మిథైల్‌ పరమాణువుల అమరిక ప్రత్యేక రీతిలో ఉండటాన్ని గుర్తించామని ద్రవంలో ఉంచినప్పుడు ఈ కేన్సర్‌ డీఎన్‌ఏ పోగులు ఉండ చుట్టుకుపోయే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉండటాన్ని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అబూ సినా తెలిపారు.

ఈ మార్పులను గుర్తించేందుకు తాము బంగారు నానో కణాలను  ఉపయోగించామని 200 మందిపై ప్రయోగాలు చేయగా 90 శాతం కచ్చితత్వంతో  కేన్సర్‌ను గుర్తించగలిగామని వివరించారు. పైగా కేవలం పది నిమిషాల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడవుతాయని కాకపోతే ప్రస్తుతానికి ఈ పరీక్ష కేన్సర్‌ ఉన్నట్లు మాత్రమే నిర్ధారించగలదని అది రొమ్ము కేన్సరా? లేక ఇంకో రకమైందా? మాత్రం గుర్తించలేదని  వివరించారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top