రితూ బెరి బెరి గుడ్ | Designer clothing with Glamorous... | Sakshi
Sakshi News home page

రితూ బెరి బెరి గుడ్

Mar 10 2016 11:25 PM | Updated on Sep 3 2017 7:26 PM

రితూ బెరి బెరి గుడ్

రితూ బెరి బెరి గుడ్

గౌన్‌లో క్వీన్‌లా... లెహంగా కడితే విహంగంలా... హాఫ్ శారీలో డిలైట్‌‘ఫుల్’గా... చోళీలో చార్మింగ్‌గా ఉంటుందా డ్రస్ డిజైనింగ్.

- రితూ
గౌన్‌లో క్వీన్‌లా... లెహంగా కడితే విహంగంలా...  హాఫ్ శారీలో డిలైట్‌‘ఫుల్’గా...  చోళీలో చార్మింగ్‌గా ఉంటుందా డ్రస్ డిజైనింగ్. అందుకే రితూ బెర్రీని ప్రీతీజింటా నుంచి ప్రిన్స్ చార్లెస్ వరకూ అందరూ బెర్రీ బెర్రీ గుడ్ అంటారు.
 

 
గ్లామరస్‌గా కనిపించాలంటే రితుబెరి  కలెక్షన్‌ను చూడకూడదు. వందల్లో ఒకరిగా కనపడాలన్నా, ప్రత్యేకతను నిలుపుకోవాలన్నా మాత్రం రితూబెరి డిజైనర్ కలెక్షన్ వైపు తప్పక దృష్టి సారించాలి. ఆమె రూపొందించిన డిజైనర్ దుస్తులు అంత అసాధారణంగా ఉంటాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం రితుబెరి డ్రెస్ డిజైన్ స్టైల్స్‌ని ‘మైండ్ బ్లోయింగ్ వర్క్’ అని ఆమెను ప్రశంసించింది. ప్రిన్స్ చార్లెస్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, నికొలె కిడ్‌మ్యాన్, పర్షియన్ సామాజికవేత్తలు, ఇండియన్ బాలీవుడ్ తారలు రాణీ ముఖర్జీ, ప్రీతీ జింతా, మాధురీ దీక్షిత్  వంటి ప్రముఖులు రితుబెరి డిజైన్ చేసిన దుస్తుల్లో మెరిశారు. ఈమె స్టోర్స్ ఢిల్లీ, ఫ్రాన్స్, జెర్మనీలలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement