దోమల నుంచి చిన్నారుల రక్షణకు.... | Sakshi
Sakshi News home page

దోమల నుంచి చిన్నారుల రక్షణకు....

Published Tue, Sep 23 2014 10:44 PM

దోమల నుంచి చిన్నారుల రక్షణకు....

చిన్నారులను దోమల బారి నుంచి రక్షించడానికి ఇప్పుడు కొత్తపద్ధతి అందుబాటులోకి వచ్చింది. మార్కెట్‌లో ‘మస్కిటో టాటూస్’ దొరుకుతాయి. వీటిని తీసుకొచ్చి చిన్నారుల చెంత ఉంచితే చాలు.. దోమలు ఇట్టే పారిపోతాయి. ఇవి మస్కిటో రిపెల్లర్‌లుగా పనిచేస్తాయి. చిన్నారుల దుస్తుల్లో, సాక్సుల్లో, ఊయల్లో.. ఎక్కడైనా వీటిని పెట్టవచ్చు. ఇవి ప్రత్యేకంగా సిట్రోనెల్లా ఆయిల్‌తో కోట్ చేయబడి ఉంటాయి. ఫలితంగా పిల్లలకు దగ్గరగా ఉంచినా దుష్ర్పభావాలు చూపవు.  మస్కిటో రిపెల్లర్‌ల కన్నా ఈ టాటూస్ వాడకం చాలా మంచిది.

Advertisement
 
Advertisement
 
Advertisement