అతడే పోలీస్... | Character Artist | Sakshi
Sakshi News home page

అతడే పోలీస్...

Oct 12 2015 12:28 AM | Updated on Aug 21 2018 5:52 PM

అతడే పోలీస్... - Sakshi

అతడే పోలీస్...

హిందీ సినిమాల్లో పోలీస్ అంటే ఇతడే. పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చుగాని మనిషిని మాత్రం ....

 క్యారెక్టర్ ఆర్టిస్ట్
 
 హిందీ సినిమాల్లో పోలీస్ అంటే ఇతడే. పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చుగాని మనిషిని మాత్రం చూడగానే పోల్చుకుంటారు. ‘కానూన్ కే హాత్ లంబే హోతే హై’... ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’... ఈ డైలాగులు చెప్పాలంటే ఇతడే చెప్పాలి. పేరు ఇఫ్తెకార్. ఊరు జలంధర్. గొంతు బాగుంటుందని పాటలు పాడి గాయకుడు కావాలని కలకత్తా వెళ్లి అక్కడ లాభం లేక ముంబై చేరుకున్నాడు. అశోక్ కుమార్ పరిచయం కావడంతో నటుడుగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు.

అయితే 1969లో వచ్చిన ‘ఇత్తెఫాక్’ (దర్శకుడు యశ్ చోప్రా) ఇఫ్తెకార్ కెరీర్‌నే మార్చేసింది. అందులో అతడు వేసిన పోలీస్ ఆఫీసర్ వేషం పెద్ద హిట్టయ్యి ఆ తర్వాత దాదాపు నాలుగు వందల సినిమాల్లో అదే పాత్రకు అతణ్ణి ఖాయపరిచింది. ‘డాన్’లో ఇఫ్తెకార్ వేసిన పాత్రను దాని తెలుగు రీమేక్‌లలో జగ్గయ్య (యుగంధర్), కృష్ణంరాజు (బిల్లా) పోషించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement