చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్‌నా... | Chalte Chalte Mere Yeh gityad rakhna .... | Sakshi
Sakshi News home page

చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్‌నా...

Oct 12 2015 12:27 AM | Updated on Sep 3 2017 10:47 AM

చల్తే చల్తే మేరే యే గీత్  యాద్ రఖ్‌నా...

చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్‌నా...

ఎవరికీ ఆ సినిమా తెలియదు. ఎవరూ దానిని చూడలేదు. కాని ఈ పాట మాత్రం కొన్ని వేల లక్షల సార్లు రేడియోలో ప్లే అయ్యింది.

ఎవరికీ ఆ సినిమా తెలియదు. ఎవరూ దానిని చూడలేదు. కాని ఈ పాట మాత్రం కొన్ని వేల లక్షల సార్లు రేడియోలో ప్లే అయ్యింది. ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాట వెనుక ఇద్దరు ఉన్నారు. ఒకరు బప్పి లాహిరి. రెండు అమిత్ ఖన్నా. ఆ రోజుల్లో ఇద్దరూ కొత్తవాళ్లే. దేవ్ ఆనంద్ కుటుంబంలో అతడిలాగే ఉండే కొంచెం దూరపు బంధువు విశాల్ ఆనంద్ తీసిన సినిమా ‘చల్తే చల్తే’ (1976). ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసి ఆ తర్వాత దేవ్ ఆనంద్ సినిమాల వ్యూహకర్తగా పని చేసిన అమిత్ ఖన్నా చేత ఇందులో పాటలు రాయించాడు.

ఈ అమిత్ ఖన్నా ఆ తర్వాత దూర దర్శన్‌లో, రిలయన్స్‌లో చాలా కీలక బాధ్యతతలు పోషించాడు. ‘బాలీవుడ్’ అనే పేరు కాయిన్ చేసింది కూడా ఇతనే అంటారు. అప్పటికి సంగీత దర్శకుడిగా ఇంకా బ్రేక్ దక్కని బప్పి లాహిరి ఈ సినిమాతోనే హిట్ మ్యూజిక్ డెరైక్టర్‌గా జనం దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత డిస్కో డాన్సర్ అతణ్ణి ఎక్కడికో తీసుకెళ్లింది. అన్నట్టు ‘చల్తే చల్తే’... అనే పాటను మీరు తెలుగులో విన్నారా? లేదా? విన్నారు. 1980లో వచ్చిన ‘పున్నమినాగు’ సినిమాలో ‘పున్నమి రాత్రి’... పాట వినండి. అది ఇదే.
 
 హిట్ సాంగ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement