సత్తా చాటుతున్నాడు! | Capabilities show! | Sakshi
Sakshi News home page

సత్తా చాటుతున్నాడు!

Sep 10 2014 11:47 PM | Updated on Sep 2 2017 1:10 PM

సత్తా చాటుతున్నాడు!

సత్తా చాటుతున్నాడు!

వెయిట్ లిప్టింగ్‌లో జాతీయంగా, అంతర్జాతీ యంగా సత్తా చాటుతున్నాడు మన తెలుగింటి కుర్రాడు రాగాల వెంకట్ రాహుల్.

వెయిట్ లిప్టింగ్‌లో జాతీయంగా, అంతర్జాతీ యంగా సత్తా చాటుతున్నాడు మన తెలుగింటి కుర్రాడు రాగాల వెంకట్ రాహుల్.
  గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ చైనాలో జరిగిన యూత్ ఒలంపిక్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు.
 రాహుల్ నాన్న మధు కూడా ఒకప్పుడు వెయిట్‌లిఫ్టరే. సరియైన సహకారం, ప్రోత్సాహం లేక మధు తన కలలను నిజం చేసుకోలేకపోయారు. అందుకే వెయిట్ లిఫ్టింగ్ విషయంలో అన్నీ తానై కొడుకును ప్రోత్సహించారు. ఏపి స్పోర్ట్స్ స్కూల్‌లో చేర్పించారు.
 ఎస్.ఎ.సింగ్, మాణిక్యాలరావులు రాహుల్‌ను టాప్ క్లాస్ లిఫ్టర్‌గా తీర్చిదిద్దారు. 2008లో 56 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలను, అదే సంవత్సరం పాటియాలాలో మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు.
 ‘‘అతనిది సహజమైన ప్రతిభ’’ అని కోచ్ ఎస్ ఎ సింగ్ రాహుల్‌ను ప్రశంసించారు.
 2016 రియో ఒలంపిక్స్‌లో రాహుల్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని సింగ్ నమ్మకంగా చెబుతున్నారు. ఆయన నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement