బ్యూటిప్స్‌ | Sakshi
Sakshi News home page

బ్యూటిప్స్‌

Published Thu, Aug 17 2017 12:10 AM

బ్యూటిప్స్‌

తలస్నానం చేయడానికి ముందు జుట్టును వెడల్పు పళ్లున్న దువ్వెనతో చక్కగా చిక్కులు వదిలే వరకు దువ్వాలి. తలను గోరువెచ్చటి నీటితో తడపాలి. షాంపూను చిన్న కప్పులోకి తీసుకుని గోరువెచ్చటి నీటితో కలపాలి. ఒక వంతు షాంపూకి అంతే మోతాదులో నీటిని కలపాలి. షాంపూ నీటిలో సమంగా కలిసిన తర్వాత జుట్టుకు పట్టించాలి. ∙షాంపూ పట్టించిన తర్వాత జుట్టు కుదుళ్లను, మాడును మసాజ్‌ చేస్తున్నట్లు వేళ్లతో వలయాకారంగా రుద్దాలి. తర్వాత జుట్టు చివర్ల వరకు రెండు చేతులతో మృదువుగా రుద్దాలి.

చన్నీరు లేదా గోరువెచ్చటి నీటితో తలను శుభ్రం చేయాలి. అలాగే రెండవ దఫా కూడా చేయాలి. అయితే రెండవ సారి పావు వంతు షాంపూ మాత్రమే తీసుకోవాలి. నీటిని ఎక్కువగా కలిపి ఉపయోగించాలి. ∙తలకు, జుట్టుకు పట్టిన షాంపూ పూర్తిగా వదిలిన తర్వాత తలకు మెత్తటి టవల్‌ను చుట్టాలి. ∙జుట్టు మరీ బిరుసుగా ఉంటే కండిషనర్‌ అప్లయ్‌ చేయవచ్చు. కండిషనర్‌ జుట్టు కుదుళ్లకు అంటకూడదు. మాడుకు తగలకుండా జుట్టుకు మాత్రమే పట్టించాలి.

Advertisement
Advertisement