
వైఎస్ జగన్
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల శాసనసభకు పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఓటు వేశారు.
పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల శాసనసభకు పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఓటు వేశారు. ఆ పార్టీ తరపున ఇక్కడ లోక్సభకు పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి కూడా అదే పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తన తండ్రి, దివంగత మహానేత వైఎస్నరాజశేఖర రెడ్డి, తల్లి విజయమ్మ ప్రాతినిధ్యం వహించిన పులివెందుల శాసనసభ స్థానం నుంచి జగన్ తొలిసారి పోటీపడుతున్నారు.