వైఎస్ జగన్ సీఎం కావాలని.. | we want ys jagan mohan reddy as CM | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ సీఎం కావాలని..

Apr 30 2014 2:31 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ జగన్ సీఎం కావాలని.. - Sakshi

వైఎస్ జగన్ సీఎం కావాలని..

వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకరరెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మంగళవారం తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి దగ్గరకు 8 మంది అభిమానులు మోకాళ్లపై వెళ్లి వేడుకున్నారు.

 సాక్షి, తిరుమల : వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని, తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకరరెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మంగళవారం తిరుమలలోని జాపాలి ఆంజనేయస్వామి దగ్గరకు 8 మంది అభిమానులు మోకాళ్లపై వెళ్లి వేడుకున్నారు. తిరుపతి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నేత దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎనిమిదిమంది తిరుమలలోని జాపాలి తీర్థానికి సుమారు 2 కిలోమీటర్ల దూరం మెట్లమార్గంలో మోకాళ్లపై వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2009లో వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం కావాలని ఇదే తరహాలో మోకాళ్లపై వచ్చి స్వామిని వేడుకున్నానన్నారు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి సీఎం కావాలని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందాలని స్వామిని కోరేందుకు మోకాళ్లపై వచ్చామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement