ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు విచ్చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన బహిరంగం సభలో సోనియా పాల్గొన్నారు.
చేవెళ్ల: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణకు విచ్చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన బహిరంగం సభలో సోనియా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువకులు, మహిళలు అన్ని వర్గాలు ప్రజలు పోరాటం చేశారని, కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతుగా నిలిచిందని సోనియా అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. తెలంగాణ అమరవీరులకు సోనియా నివాళులు అర్పించారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.