కేసీఆర్.. విచారణకు సిద్ధమా?: పొన్నాల | Ponnala laxmaiah warns KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్.. విచారణకు సిద్ధమా?: పొన్నాల

Apr 25 2014 4:38 AM | Updated on Aug 15 2018 9:06 PM

కేసీఆర్.. విచారణకు సిద్ధమా?: పొన్నాల - Sakshi

కేసీఆర్.. విచారణకు సిద్ధమా?: పొన్నాల

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ చేశారు.

వరంగల్, న్యూస్‌లైన్: తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమా అని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావును టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాల్ చేశారు.  నీపై భూ ఆక్రమణలు, మహిళల అక్రమ రవాణా, దొంగనోట్లు, నకిలీ పాప్‌పోర్టు, నీ బిడ్డ సినిమావాళ్ల దగ్గర, కొడుకు రియల్ ఎస్టేట్ వాళ్ల వద్ద వసూళ్లు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పారు. హన్మకొండలో గురువారం విలేకరులతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలపై లోకాయుక్త, సీబీఐ విచారించి.. క్లీన్‌చిట్ ఇచ్చాయని, అయితే కేసీఆర్‌పై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన విచారణకు సిద్ధపడి నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement