ఇద్దరు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ | Nominations of 2 NDA candidates rejected in tamilnadu | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎన్డీయే అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ

Apr 7 2014 4:38 PM | Updated on Aug 14 2018 4:21 PM

టెలికం శాఖ మాజీ మంత్రి రాజాపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

టెలికం శాఖ మాజీ మంత్రి రాజాపై పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. నీలగిరి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్.గురుమూర్తి తన నామినేషన్ పత్రంతో పాటు సరైన సమయంలో బీఫారం సమర్పించకపోవడంతో రిటర్నింగ్ అధికారి పి.శంకర్ ఆయన నామినేషన్ తిరస్కరించారు. అయితే, అప్పీలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయనకు అధికారులు సూచించినట్లు సమాచారం. అలాగే, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనుంచి పోటీచేస్తున్న రాణి ఎప్పుడో 1986లో జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడంతో తాజా పత్రం తేవాలని ఆమె నామినేషన్ పెండింగులో పెట్టారు.

ఇక చిదంబరం స్థానంలో బీజేపీ కూటమిలోని పార్టీ పీఎంకే అభ్యర్థి మణిరత్నం తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే పదిమంది సంతకాలు జత చేయకపోవడంతో ఆయన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. అయితే, ఆయనకు డమ్మీగా నామినేషన్ వేసిన ఆయన భార్య సుధ పత్రాలు మాత్రం సరిగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement