కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని | no use with kiran kumar reddy, says pithani satyanarayana | Sakshi
Sakshi News home page

కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని

Apr 4 2014 8:26 PM | Updated on Aug 14 2018 4:21 PM

కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని - Sakshi

కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదు: పితాని

మాజీ మంత్రి, జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు.

హైదరాబాద్: మాజీ మంత్రి, జైసమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనతో పాటు గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు కుమారుడు శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. వీరిద్దరికి చంద్రబాబు పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా వెల్లడైన వివిధ సర్వేల ఫలితాల్లో టీడీపీ పుంజుకుంటోందని వెల్లైడెందన్నారు. వైఎస్సార్‌సీపీ బలం తగ్గిపోతోందన్నారు. సీమాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే శక్తి తనకే ఉందని భావించి పలువురు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం ఖాయమన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. పితాని మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డితో ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేయటంతోనే తాము బైటకు వచ్చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement