వైఎస్సార్ సీపీలో చేరిన నౌమాన్ | Naumann to join Ysr congress party | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన నౌమాన్

Apr 15 2014 2:26 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ సీపీలో చేరిన నౌమాన్ - Sakshi

వైఎస్సార్ సీపీలో చేరిన నౌమాన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) మాజీ సభ్యుడు డాక్టర్ నౌమాన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.

పలువురు టీడీపీ నేతలు కూడా...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) మాజీ సభ్యుడు డాక్టర్ నౌమాన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సోమవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కర్నూలుకు చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. నంద్యాల లోక్‌సభ స్థానం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌హెచ్ భాస్కర్‌రెడ్డి, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఎన్‌హెచ్ ప్రసాదరెడ్డి, ఇతర నేతలు గోపవరం నాగిరెడ్డి, సాయినాథ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, గణేష్‌రెడ్డి, సూరజ్‌రాంరెడ్డి, సుమంత్‌రెడ్డితో సహా పలువురు జగన్ నివాసానికి వచ్చి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీజీసీ సభ్యుడు భూమా నాగిరెడ్డి కూడా హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement