నమో తెలంగాణ | Namo telanagana tour sucessful tour | Sakshi
Sakshi News home page

నమో తెలంగాణ

Apr 23 2014 3:52 AM | Updated on Aug 15 2018 2:14 PM

భారత విజయ ర్యాలీ పేరిట జరిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ సభ ‘కమల’ దళంలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సభకు తెలుగుదేశం శ్రేణులూ కలిసికట్టుగా హాజరైనా ‘ఐక్యత’ అన్ని దశల్లో కనిపించలేదు.

భారత విజయ ర్యాలీ పేరిట జరిగిన బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ సభ ‘కమల’ దళంలో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ సభకు తెలుగుదేశం శ్రేణులూ కలిసికట్టుగా హాజరైనా ‘ఐక్యత’ అన్ని దశల్లో కనిపించలేదు. బీజేపీ పరంగా సభను తమ భుజాలపైనే మోసుకొని ఆ నేతలు నడిపించారు. అనుకున్న మేర జన సమీకరణ కూడా జరగడంతో ఆ పార్టీ కేడరు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇదే జోష్‌లో ప్రచార పర్వాన్ని పూర్తిచేస్తే తమకు మంచి ఫలితాలొస్తాయని లెక్కలు వేస్తున్నారు.
 
 పాలమూరు జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీకళాశాల మైదానంలో మంగళవారం సాయంత్రం నిర్వహించి న భారత విజయ ర్యాలీ, ఎన్డీయేసభ సక్సెస్ అయ్యింది. భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో కలిసి మొదటిసారిగా పాలమూరుకు వచ్చారు. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్రను వివరిస్తూనే ఆంక్షలతో కూడిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై తన ప్రసంగంలో విమర్శలు గుప్పించారు. అనంతరం రాష్ట్ర, జిల్లా సమస్యలను ప్రస్తావించా రు. పాలమూరు వలసలను నిలుపుతానని, రైతుల కన్నీళ్లు తూడుస్తానని, నీటి సమస్యకు శాశ్వతపరిష్కారం చూపుతానని మోడీ హామీనిచ్చారు.
 
 కేసీఆర్‌వి మోసపూరిత మాటలు
 ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట. ఆయనవన్నీ మోసపూరిత మాటలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రిని ద ళితుడినే చేస్తానని చె ప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. స్వార్థం కోసం అర చేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. తెలంగాణ వికాసం టీఆర్‌ఎస్‌తో సాధ్యం కానిపని. కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు. బీజేపీ ప్రభంజనంలో కొట్టుకపోతుంది.
 - మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి నాగం జనార్ధన్‌రెడ్డి
 
 బీజేపీతోనే పారదర్శక పాలన
 పారదర్శక, అవినీతి మరకలు లేని ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. కాం గ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలను తరిమికొట్టాలి. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లే. దోపిడీ చేయడానికి ఆ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నారుు. ఈ విషయాన్ని ప్రజలందరు గ్రహించి తిప్పి కొట్టా లి. వలసల నివారణ, కార్మికుల బతుకులు మారాలంటే, 10 లక్షల ఎకరాల సాగునీరు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా బీజేపీని అధికారంలోకి తేవాలి.
 - మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
 
 కాంగ్రెస్ హయూంలో అవినీతి, అశాంతి
 కాంగ్రెస్‌హయాంలో అవినీతి అక్రమాలు పెరిగి పోయూరుు. ధరలు ఆకాశాన్నంటా రుు. అశాంతితో దేశ ప్రజలందరు ఇబ్బం దులను ఎదుర్కొంన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పీడ ఈ ఎన్నికలతో విరగడవ్వాలి. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు పూర్తరుు రైతులు సంతోషంగా ఉండాలంటే ఎన్డీయే అధికారంలోకి రావాలి. దేశంలో నరేంద్రమోడీ హవాడ నడుస్తోంది. ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ఓడించి బుద్ధి చెప్పాలి.                  
 - కల్వకుర్తి అసెంబ్లీ టి. ఆచారి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement