ధరల మంట | in election campaign leaders not tell about the prices of essential commodities | Sakshi
Sakshi News home page

ధరల మంట

Apr 26 2014 3:30 AM | Updated on Sep 28 2018 3:22 PM

ధరల మంట - Sakshi

ధరల మంట

నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. సగటు మనిషి జీవితం ఆగమవుతోంది.

 చంద్రశేఖర్‌కాలనీ, న్యూస్‌లైన్: నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. సగటు మనిషి జీవితం ఆగమవుతోంది. ఏమి కొనేట్టు లేదు.. ఏమి తినేట్టు లేదు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు గగ్గోలు పెట్టే రాజకీయ పార్టీల నాయకులు స రుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, వాటి ఊ సే ఎత్తడం లేదు. దీనిపై ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు పేద, సా మాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండుపూటలా పప్పుచారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుం డాపోతున్నాయని పేదలు వాపోతున్నారు.

మొన్నటి వరకు సన్నరకం (బీపీటీ) బియ్యం ధరలు కొద్దిగా తగ్గినట్టు కనిపించినా, మళ్లీ వాటికి రెక్కలు వచ్చాయి. పప్పుల విషయానికి వస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ. 50 నుంచి రూ. 60 రూపాయలు ఉన్న పెసర, కంది పప్పుల ధరలుఏకంగా కిలో రూ. 90 నుంచి రూ. 120 వరకు ఎగబాకాయి. పేద లు పెసర, కంది పప్పులను వారంలో ఐదు రోజు లైనా ఉపయోగిస్తారు. ఎండిన కుడుకలు మొన్నటి వరకు కిలో రూ. 80 నుంచి 90 ఉండగా, వారం రోజుల నుంచి ఏకంగా కిలో రూ. 150కి పెరిగిపోయాయి. ఇక సన్న బియ్యం ధరలు క్వింటాలుకు రూ. 3600 నుంచి రూ. 4000, హెచ్‌ఎంటీ బియ్యం రూ. 4200 నుంచి రూ. 4600 చొప్పన అమ్మకాలు జరుగుతున్నాయి.  సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన నాయకులు ధరల తగ్గింపుపై పెదవి విప్పకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement