కాంగ్రెస్‌కు సమాధి కట్టండి: చంద్రబాబునాయుడు | grave to the congress party in seemandhra | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు సమాధి కట్టండి: చంద్రబాబునాయుడు

Apr 20 2014 4:42 AM | Updated on Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్‌కు సమాధి కట్టండి: చంద్రబాబునాయుడు - Sakshi

కాంగ్రెస్‌కు సమాధి కట్టండి: చంద్రబాబునాయుడు

తొమ్మిదేళ్లపాటు రాష్ట్రంలో నేను వెలిగించిన దీపాలను కాంగ్రెస్ పార్టీ ఆపేసింది, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి సమాధి కట్టాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

 గుంటూరు జిల్లా రోడ్‌షోలో బాబు పిలుపు

సాక్షి, గుంటూరు: ‘తొమ్మిదేళ్లపాటు రాష్ట్రంలో నేను వెలిగించిన దీపాలను కాంగ్రెస్ పార్టీ ఆపేసింది, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి సమాధి కట్టాలి’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లె, బాపట్లలో శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పలుచోట్ల ప్రసంగించారు. సోనియాగాంధీ సొంత జాగీరులాగా సీమాంధ్రులకు కనీసం రాజధాని కూడా చూపకుండా రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఆ పార్టీ బతకకుండా గొయ్యి తీసి పాతెయ్యాలన్నారు.
 
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో సమస్యలు పేరుకుపోయాయని ఏకపక్ష విభజన తర్వాత సీమాంధ్రలో సమస్యలు జటిలమయ్యాయన్నారు. విభజనను తాను ఆది నుంచి వ్యతిరేకించానన్నారు. తాము అధికారంలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేస్తామన్నారు. గుంటూరు జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. రైతులకు కష్టమనేది లేకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్‌ను తరిమి కొట్టేందుకే మోడీతో జతకట్టినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement