'ఫ్యాను గాలికి నిప్పు తోడైంది' | Fire added to fan wind : Tammineni Veerabhadram | Sakshi
Sakshi News home page

ఫ్యాను గాలికి నిప్పు తోడైంది

Apr 19 2014 6:56 PM | Updated on Aug 14 2018 4:21 PM

తమ్మినేని వీరభద్రం - Sakshi

తమ్మినేని వీరభద్రం

వైఎస్‌ఆర్‌ సీపీ ఫ్యాన్‌ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ఖమ్మం:  వైఎస్‌ఆర్‌ సీపీ ఫ్యాన్‌ గాలికి సీపీఎం నిప్పు తోడైందని, ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ-సీపీఎం కూటమిదే విజయం అని సీపీఎం తెలంగాణ  రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం, వైఎస్‌ఆర్‌ సీపీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ సందర్భంగా వీరభద్రం మాట్లాడుతూ పాలేరు శాసనసభ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న  పోతినేని సుదర్శనరావు విజయం తథ్యం అన్నారు.

  ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం నారాయణపురంలో ఆగస్టు 8, 1965లో జన్మించిన  సుదర్శన్‌ రావు 2006లో ఖమ్మం జిల్లా సిపిఎం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1992లో  చిన్నబీరవల్లి ఎంపిటిసిగా ఎన్నికయ్యారు. 1995 నుండి 2000 వరకు బోనకల్‌ మండల పరిషత్‌ ఉపాధ్యక్షులుగా, కొంతకాలం ఎంపిపిగా కూడా  పనిచేశారు.  ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement