ఆ రోజులు మాకొద్దు! | Sakshi
Sakshi News home page

ఆ రోజులు మాకొద్దు!

Published Tue, May 6 2014 1:29 AM

ఆ రోజులు మాకొద్దు! - Sakshi

బాబు డైరీ (ఎలక్షన్ సెల్): కరువు గజ్జె కట్టి నాట్యమాడుతుంటే ..  కళ్లు తెరిచి చూసేందుకూ ఇష్టపడని రోజులు
 పంటల్లేక, పనుల్లేక జనం వలస వెళ్తుంటే..  పలకరించడానికీ మనసొప్పని రోజులు  అప్పులపాలై అన్నదాత అసువులు బాస్తుంటే..
 ‘అయ్యో పాపం’ అని కూడా అనని రోజులు  పరిహారమడిగితే అజీర్తి మరణాలంటూ..  పరిహాసమాడిన రోజులు
 పసిబిడ్డలకు ఒక్కపూటైనా ఆకలి తీర్చమంటే..  ఆ ఒక్కటీ అడగొద్దంటూ తెగేసి చెప్పిన రోజులు  ప్రాణాలు పోతున్నాయన్నా..
 ప్రపంచ బ్యాంకు జపం వీడని రోజులు  కన్నబిడ్డలు కడపాత్రం వెళుతుంటే..  కన్నీటి పర్యంతమైన రోజులు  కడుపు మాడ్చుకోలేక, క‘న్నీటి’ని తాగలేక...  దాతలిచ్చిన గంజినీళ్లతో ప్రాణాలు నిలుపుకున్న రోజులు  ‘కంటి పాపల’ కడుపు నింపలేక..  కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు  .. ఆ రోజులు మాకొద్దు అంటున్నారు పల్లెప్రజలు. ఆ..కలి కాలం  మళ్లీ వద్దంటున్నారు అన్నదాతలు.

Advertisement
Advertisement