ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారి డైరీ అత్యంత ప్రధానమైనదని, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను సూచించారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికలలో ప్రిసైడింగ్ అధికారి డైరీ అత్యంత ప్రధానమైనదని, ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులను సూచించారు.ఆదివారం ముఖ్య ప్రణాళికాధికారి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్‌రిటర్నింగ్ అధికారి చెక్ మెమో సరిచూసుకోవాలని, ప్రిసైడింగ్ అధికారి హ్యాండ్‌బుక్‌లోని ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే సమయంలో బూత్‌లోకి ఎన్నికల సిబ్బంది, ఓటర్లు తప్ప ఇతరులెవరూ లోనికి రాకుండా చూడాలన్నారు.ప్రిసైడింగ్ అధికారి మినహా ఎవరికి ఫోన్ ఉండకూడదన్నారు. వృద్ధులు, అంధులు ఓటు వేయడానికి సహాయంగా ఒకరిని తెచ్చుకోవడానికి అనుమతించాలన్నారు.
ఓటర్ల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అనుమతించాలన్నారు. టెండర్ ఓటు, చాలెంజ్ ఓటు, నిరాకరించిన ఓటు వయసు అర్హత లేని ఓటు తదితర నిబంధనలను నిశితంగా పరిశీలించాలన్నారు. ఎన్నిక సరైన పద్ధతిలో నిర్వహించారో ప్రిసైడింగ్ అధికారి డైరీ సూచిస్తుందన్నారు. దానితో పాటు బ్యాలెట్ పేపరు ఎకౌంట్ కూడా అత్యంత ప్రధానమైనవని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం సజావుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ సురేష్‌బాబు ,డ్వామా పీడీ శివలింగయ్య, జేడీఏ నర్సింహ, అధికారులు పాల్గొన్నారు.