బీజేపీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్వాది పార్టీ చిత్తయింది. కాషాయ పార్టీ దెబ్బకు మాయావతి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.
లక్నో: బీజేపీ ప్రభంజనంలో ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్వాది పార్టీ చిత్తయింది. కాషాయ పార్టీ దెబ్బకు మాయావతి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
సీతాపూర్ నియోజకవర్గంలో మాత్రమే బీఎస్పీ అభ్యర్థి కైసర్ జహాన్ తొలి రౌండ్లో ఆధిక్యం కనబరిచారు. తర్వాత ఆమె వెనుకబడిపోయారు. 34 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ సానుకూల పవనాలు వీయడంతో బీఎస్పీ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది.