
సోనియాపై ఉమ, రాహుల్‌పై స్మృతి ఇరానీ?
కాంగ్రెస్ అగ్రనేతలపై పోటీకి దీటైన అభ్యర్థులను దించాలని బీజేపీ భావిస్తోంది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేతలపై పోటీకి దీటైన అభ్యర్థులను దించాలని బీజేపీ భావిస్తోంది. దీటైన అభ్యర్థులను నిలపడం ద్వారా గట్టి పోటీ ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై పైర్బ్రాండ్ ఉమా భారతిని నిలిపితే ఎలా ఉంటుందని కమలనాథులు ఆలోచిస్తున్నారు. రాయబరేలీలో సోనియాకు ఉమాభారతి గట్టి పోటీ ఇవ్వగలరని కమలం పార్టీ భావిస్తోంది. సోనియాపై ఉమా భారతిని పోటీకి పెట్టాలని యోగా గురువు బాబా రాందేవ్ కూడా సూచించారు.
ఇక అమేథి నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాహుల్పై నటి స్మృతి ఇరానీని పోటీకి పెట్టాలని బీజేపీ సీనియర్లు అగ్రనాయకత్వానికి సూచించారు. అయితే కాంగ్రెస్కు గట్టి పట్టున్న రాయబరేలీ, అమేథిలో నియోజకవర్గాల్లో కమలం ఏమేరకు వికసిస్తుందో చూడాలి.