విట్టేకర్ జీవుల వర్గీకరణ

విట్టేకర్ జీవుల వర్గీకరణ
 జీవుల నిర్మాణం, వాటి వైవిధ్యాల శాస్త్రీయ అధ్యయనమే.. జీవశాస్త్రం. భూమిపై ఉన్న విభిన్న జీవుల రకాలు, వాటి లక్షణాలపై పోటీపరీక్షల్లో క్రమం తప్పకుండా ప్రశ్నలు వస్తున్నాయి. ఆర్ట్స్ అభ్యర్థులు, నాన్-బయాలజీ అభ్యర్థులు ఎక్కువగా నిర్లక్ష్యం చేసే అంశం ఇదే. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2, ఇతర పరీక్షల్లో పెరుగుతున్న పోటీ దృష్ట్యా అభ్యర్థులు  జనరల్ స్టడీస్‌లోని ఏ అంశాన్ని నిర్లక్ష్యం చేసేందుకు వీల్లేని జీవశాస్త్రంపై ఫోకస్..

 

 జీవశాస్త్రంలో ముఖ్యమైన అంశం వివిధ రకాల జీవుల వర్గీకరణ, వాటి సాధారణ లక్షణాలు, ఉదాహరణలు. భూమిపై 3.5 బిలియన్ ఏళ్ల క్రితం జీవులు ఆవిర్భవించాయి. మొదట్లో భూమిపై ఏర్పడిన జీవులన్నీ అవాయు జీవులు. వీటిలో కొన్ని నీటి అణువులను విచ్ఛిన్నం చేయగా క్రమంగా గాల్లో ఆక్సిజన్ విడుదలైంది. ఆ తర్వాత ఆక్సిజన్ వినియోగించే ఏరోబిక్ జీవులు పరిణామం చెందాయి. ప్రస్తుతం భూమిపై ఉన్న 21 శాతం ఆక్సిజన్‌కు మూలం ఆ తర్వాత ఆవిర్భవించిన మొక్కలు. అవి తమ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా గాల్లోకి ఆక్సిజన్ విడుదల చేయగా ప్రస్తుత వాతావరణంలోని 21శాతం ఆక్సిజన్ సాధ్యమైంది.

 

 వర్గీకరణ ప్రయత్నాలు

 భూమిపై ఉన్న జీవులన్నిటినీ వర్గీకరించడానికి ప్రారంభం నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. భూమిపైన ఉన్న జీవులన్నింటినీ అరిస్టాటిల్ జంతువులు, మొక్కలుగా వర్గీకరించాడు. కంటికి కనిపించని సూక్ష్మజీవులపై అవగాహన లేకపోవడం ద్వారా మొక్కలు, జంతువులు మాత్రమే జీవులని ప్రారంభంలో భావించేవారు. 19వ, 20వ శతాబ్దంలో పరిశోధనల ద్వారా భూమిపై సూక్ష్మజీవుల, వాటి రకాలపై అవగాహన పెరిగిన తర్వాత జీవుల వర్గీకరణ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఎంతో మంది జీవులను వర్గీకరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అధిక ఆమోదంలో ఉన్నది రాబర్ట్ విట్టేకర్ ప్రతిపాదించిన అయిదు రాజ్యాల వర్గీకరణ.

 

 

  రాజ్యాల వర్గీకరణ

 భూమిపై ఉన్న జీవులన్నింటినీ కింది మూడు ప్రమాణాల ఆధారంగా రాబర్ట్ విట్టేకర్ 5 రాజ్యాల్లోకి వర్గీకరించాడు. మొదటి ప్రమాణం - కణాల సంశ్లిష్టత: జీవులన్నీ కణ నిర్మితాలు. కణ వ్యవస్థ లేనప్పుడు దేనినైనా నిర్జీవి అంటారు. సూక్ష్మమైన బ్యాక్టీరియా మొదలుకొని సంశ్లిష్ట మనుషుల వరకు అన్ని జీవులలో కణ వ్యవస్థ ఉంటుంది. అంటే ప్రతి జీవి, కణాలు అనే నిర్మాణ క్రియాశీల ప్రమాణాలతో నిర్మితమవుతుంది. జీవుల కణాలు రెండు రకాలు. ఒక నిర్దిష్ట కేంద్రకం, ఇతర కణ భాగాలు ఉన్నవి నిజకేంద్రక కణాలు. కేంద్రకం అనే కణభాగం లేకుండా, జన్యుపదార్థం కణద్రవ్యాలలో ఉంటూ, రైబోజోములు తప్ప ఇతర కణభాగాలు లేని పూర్వ కణాలు... కేంద్రక పూర్వ జీవులు. ఈ విధంగా కణవ్యవస్థ ఆధారంగా జీవులు రెండు రకాలు. నిజకేంద్రక కణాలున్న జీవులు.. నిజకేంద్రక జీవులు; కేంద్రక పూర్వ కణాలున్న జీవులు.. కేంద్రక పూర్వ జీవులు.

 

 రెండో ప్రమాణం - శరీర సంశ్లిష్టత: దీని ఆధారంగా జీవులు రెండు రకాలు. ఏకకణ జీవులు, బహుకణ జీవులు. ఏకకణ జీవుల శరీరం ఒక కణంతోనే నిర్మితమవుతుంది. బహుకణ జీవుల శరీరం అనేక కణాలతో నిర్మితమవుతుంది. మూడో ప్రమాణం - పోషణ: పోషణ ఆధారంగా జీవులు రెండు రకాలు. స్వయం పోషకాలు, పరపోషకాలు. కిరణజన్య సంయోగ క్రియను నిర్వహించే మొక్కలు కొన్ని బ్యాక్టీరియా స్వయం పోషకాలు. ఇవి సౌరశక్తిని గ్రహించి కార్బన్‌డైఆక్సైడ్, నీరు వంటి సరళ అణువుల నుంచి పిండి పదార్థాన్ని తయారుచేస్తాయి. ప్రత్యక్షంగా/పరోక్షంగా తమ ఆహారం కోసం మొక్కలపై ఆధారపడే జీవులు.. పరపోషకాలు. ఉదా: జంతువులు, శిలీంధ్రాలు. అత్యధిక జంతువులు స్వేచ్ఛా జీవులు. వీటిలో శాఖాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు ఉంటాయి. కొన్ని జంతువులు పరాన్న జీవులుగా వ్యవహరిస్తూ మనిషి, ఇతర జంతువుల్లో వ్యాధికారకాలుగా వ్యవహరిస్తాయి. ఉదా: బద్దె పురుగులు, ప్లాస్మోడియం, గుండ్రటి పురుగు, పేను వంటివి.

 

 రాబర్ట్ విట్టేకర్ అయిదు రాజ్యాలు

 మొనీరా (కౌ్ఛట్చ): ఈ రాజ్యంలోకి అన్ని కేంద్రకపూర్వజీవులను వర్గీకరించారు. ఇవన్నీ ఏకకణ జీవులు. అత్యంత పూర్వపరమైన, సరళమైన జీవులు. ఒక కణమే వీటిలో జీవిగా వ్యవహరిస్తుంది.

 

 ఉదా: బ్యాక్టీరియా, సయనోబ్యాక్టీరియా.

 బ్యాక్టీరియా రకాలు.ఆర్కీ బ్యాక్టీరియా: ఇవి పురాతన బ్యాక్టీరియా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలవు. ఉదా: థర్మోప్లాస్మా, మెథనోబ్యాక్టీరియా.యూబ్యాక్టీరియా: ఇవి సాధారణ బ్యాక్టీరియా. వీటిలో అనేకం మనిషికి ఉపయోగపడతాయి. అదేవిధంగా మనిషి, ఇతర జంతువులు, పంటపొలాల్లో వ్యాధులను కలుగజేస్తాయి. ఉదా: ల్యాక్టోబ్యాసిల్లస్, విబ్రియో కలరే, బాసిల్లా ఆంథ్రసిస్.    సయనోబ్యాక్టీరియా పూర్వనామం నీలి ఆకుపచ్చ శైవలాలు (ఆఠ్ఛ ఎట్ఛ్ఛ అజ్చ్ఛ). ప్రారంభంలో వీటిని శైవలాలు (మొక్కలు) అనుకొని మొక్కల్లో వర్గీకరించారు. ఆ తర్వాత ఇవి కేంద్రక పూర్వ జీవులుగా గుర్తించి మొనీరా రాజ్యంలో వర్గీకరించారు.

 

 పొటిస్టా (Protista): ఏకకణ, నిజకేంద్రక జీవులను ఈ రాజ్యంలోకి వర్గీకరించారు. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలలోని ఏకకణ జీవులను ఈ రాజ్యంలో వర్గీకరించారు.ఉదా: ఏకకశైవలాలు, ఏకకణ జంతువులు (ప్రోటోజోవా), ఏకకణ శిలీంధ్రాల (Yeast).

 

 శిలీంధ్ర రాజ్యం : వీటిలో శిలీంధ్రాలను వర్గీకరించారు. శిలీంధ్రాలు పరపోషకాలు. అయితే జంతువుల లాగా జంతు భక్షణను ప్రదర్శించవు. ఇవి అత్యధికంగా విచ్ఛిన్నకారులుగా వ్యవహరిస్తూ జంతు వృక్ష కళేబరాలలోని కర్బన వ్యర్థాలు అకర్బన ఖనిజాలుగా మారి మళ్లీ మొక్కల అభివృద్ధికి దోహదపడతాయి. శిలీంధ్రాల వంటి విచ్ఛిన్నకారులు లేకపోతే మొక్కలు బతకలేవు. కొన్ని శిలీంధ్రాలు మనిషి, ఇతర జంతువులు, పంట మొక్కలపై దాడి చేసి వ్యాధులను కలుగజేస్తాయి. వీటిని సాధారణంగా బూజులు అని పిలుస్తారు. పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. వృక్ష రాజ్యం (Plantae): ఈ రాజ్యంలో బహుకణ మొక్కలను వర్గీకరించారు. ఇవి ప్రధానంగా స్వయం పోషకాలు. ఉత్పత్తిదారులుగా వ్యవహరిస్తూ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఇతర జీవులకు కావాల్సిన పిండిపదార్థాన్ని తయారుచేస్తాయి.

 

 మొక్కల్లో రకాలు:

 క్రిప్టోగామ్స్: ఇవి పుష్పించని మొక్కలు. పూర్వపరమైనవి. విత్తనాలు ఉండవు. స్థిర బీజాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. థాలోఫైట్స్, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్ అనే రకాలు ఈ విభాగంలో ఉంటాయి. ఫానిరోగామ్స్: పుష్పించే మొక్కలు. వీటిలో నిజమైన పుష్పాలు/ పుష్పాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వివృత బీజాలు(ఎడఝౌటఞ్ఛటఝట), ఆవృత బీజాలు (Angiosperms) అనే రెండు రకాలు ఈ విభాగంలో ఉంటాయి. మొక్కలన్నింటిలో సంశ్లిష్టమైనవి, ఉన్నతమైనవి ఆవృతబీజాలు. మొక్కల ప్రాతినిధ్య లక్షణాలన్నింటినీ ఇవి ప్రదర్శిస్తాయి.

 

 ంతురాజ్యం: జీవులన్నింటిలోకెల్లా ఉన్నతమైనవి జంతువులు. ఈ వర్గంలో బహుకణ జంతువులన్నింటినీ వర్గీకరించారు. జంతువులు పరపోషకాలు. జంతు భక్షణను ప్రదర్శిస్తాయి. జంతువులన్నీ వివిధ వర్గాల్లోకి విభజించారు. ఒక్కో వర్గంలో కొన్ని ప్రధాన సామాన్య లక్షణాలు ఉన్న జీవులను వర్గీకరిస్తారు. ఒక వర్గాన్ని మళ్లీ విభాగాల్లోకి, విభాగాన్ని క్రమాలలోకి, క్రమాన్ని కుటుంబాలలోకి, కుటుంబాన్ని ప్రజాతి/జాతుల్లోకి విభజిస్తారు. జంతువర్గాలన్నింటిలోనూ పెద్దది ఆర్థ్రోపొడా. ఉన్నతమైన వర్గం కార్డేటా. జంతువులను సాధారణంగా అకశేరుకాలు (వెన్నెముక లేనివి), సకశేరుకాలు (వెన్నెముక ఉన్నవి)గా కూడా విభజిస్తారు.

 

 పై అయిదు రాజ్యాల్లోకి విభజించిన జీవులన్నీ కణవ్యవస్థను ప్రదర్శిస్తాయి. ఇవి కాకుండా కణ వ్యవస్థలేని కొన్ని ప్రత్యేక నిర్మాణాలనూ గుర్తించారు. జీవుల శరీరంలో ఉన్నంతకాలం ఇవి జీవి లక్షణాలను ప్రదర్శిస్తాయి. జీవుల, శరీరం వెలుపల ఇవి నిర్జీవులుగా ఉంటాయి.

 ఉదా: వైరస్‌లు, ప్రియాన్‌లు, వైరాయిడ్‌లు.

 

 

 నమూనా ప్రశ్నలు

  1.    కణ వ్యవస్థ లేనివి

     1) వైరస్        2) శిలీంధ్రం

     3) శైవలం        4) అన్నీ

 

 2.    వైరస్ అనే పదానికి అర్థం

     1) ఆహారం        2) విషం

     3) దాడి        4) కణం లేనిది

 

 3.    జంతువుల్లో పూర్తిగా సముద్రంలో మాత్రమే కనిపించేవి

     1) స్పంజికలు    2) చేపలు

     3) నక్షత్ర చేపలు    4) డాల్ఫిన్లు

 

 4.    కింది వాటిలో పూర్తి జల క్షీరదం

     1) తిమింగలం    2) సముద్ర ఆవు

     3) మనటీ        4) అన్నీ

 

 5.    కింది వాటిలో శిలీంధ్రం ఏది?

     1) ఈస్టు        2) పెన్సీలియం

     3) పుట్టగొడుగు    4) అన్నీ

 

 6.    ఏ రెండింటి మధ్య మైకోరైజ అనే సహజీవనం ఏర్పడుతుంది?

     1) శైవలం, శిలీంధ్రం    2) శిలీంధ్రం, మొక్క వేర్లు

     3) బ్యాక్టీరియా, శైవలం

     4) బ్యాక్టీరియా, మొక్క వేర్లు

 

 7.    వరి పొలాల్లో జీవ ఎరువుగా వినియోగించేది?

     1) లెమ్న        2) వుల్ఫియా

     3) అజోల్లా        4) స్ఫాగ్నం

 

 8.    వృక్షశాస్త్ర పితామహుడు

     1) అరిస్టాటిల్    2) థియోప్రాస్టస్

     3) లివన్‌హక్    4) రాబర్ట్ హుక్

 

 9.    అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం

     1) ఆస్ట్రేలియా    2) ఈక్వెడార్

     3) అమెరికా    4) భారత్

 

 10.    కింది వాటిలో వివృతబీజం ఏది?

     1) యూకలిప్టస్    2) సైకస్

     3) ఎర్రచందనం    4) మామిడి

 

 11.    వర్గీకరణ శాస్త్రం ప్రకారం మనిషి ఏ క్రమానికి చెందిన వాడు?

     1) ప్రైమేట్స్    2) కార్నివోరా

     3) ఆర్టియోడ్యాక్టైలా    4) రోడెన్షియా

 

 12.    వైరస్ ద్వారా సంభవించే వ్యాధి

     1) సిఫిలిస్        2) గనేరియా

     3) టైఫస్         4) ఏవీ కాదు

 

 13.    ఎబోలా వ్యాధి ఒక

     1) ఫ్లేవీవైరస్    2) ఫైలోవైరస్

     3) బున్యావైరస్    4) మార్బిల్లివైరస్

 

 14.    బ్యాక్టీరియా ద్వారా సంభవించే వ్యాధి

     1) ట్రకోమా    2) ఎల్లో ఫీవర్

     3) పోలియో    4) రుబెల్లా

 

 15.    అతిపెద్ద అకశేరుకం

     1) ఆక్టోపస్        2) సెపియా

     3) ఆర్కిట్యుతిస్    4) అప్లీసియా

 

 16.    చెరుకు రసం నుంచి ప్రత్యేకంగా తయారు చేసే మత్తు పానీయం

     1) విస్కీ        2) రం

     3) వోడ్కా        4) మీడ్

 

 17.    కింది వాటిలో కీటకం కానిది ఏది?

     1) టిక్        2) మైట్

     3) తేలు        4) అన్నీ

 

 18.    జీవులన్నింటినీ అయిదు రాజ్యాలలోకి విభజించినవారు

     1) అరిస్టాటిల్    2) థియోప్రాస్టస్

     3) రాబర్ట్ విట్టేకర్    4) లిన్నేయస్

 

 19.    మొదటిసారిగా గుర్తించిన వైరస్

     1) ఎపిస్టీన్ బార్ వైరస్

     2) టొబాకో మొజాయిక్ వైరస్

     3) లింఫాడినోపతి అసోసియేటెడ్ వైరస్

     4) హ్యూమన్ పాపిల్లోమా వైరస్

 

 20.    {పయాన్ అనే వ్యాధి కారకం ద్వారా సంభవించే వ్యాధి

     1) పశువుల్లో మ్యాడ్ కౌ    2) గొర్రెల్లో స్క్రేపీ

     3) మనిషిలో కురు    4) అన్నీ

 

 సమాధానాలు

 1) 1    2) 2    3) 3    4) 4    5) 4

 6) 2    7) 3    8) 2    9) 1    10) 2

 11) 1    12) 4    13) 2    14) 1    15) 3

 16) 2    17) 4    18) 3    19) 2    20) 4

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top