సఖరోవ్ ప్రైజ్ | sakharov prize | Sakshi
Sakshi News home page

సఖరోవ్ ప్రైజ్

Nov 7 2014 10:23 PM | Updated on Jul 11 2019 5:01 PM

సఖరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి.

సఖరోవ్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతుల్లో ఒకటి. మానవ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు దీన్ని ఇస్తారు. దీన్ని యూరోపియన్ పార్లమెంట్ డిసెంబర్ 1988లో ఏర్పాటు చేసింది. ఈ బహుమతి కింద 50,000 యూరోలను అందజేస్తారు.

రష్యాకు చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త, మానవ హక్కుల కార్యకర్త అయిన ఆండ్రీ సఖరోవ్ పేరు మీద దీన్ని నెలకొల్పారు. ఆయన 1975లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. 1988లో తొలి సఖరోవ్ ప్రైజ్‌ను దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా, సోవియట్ యూనియన్‌కు చెందిన అనతోలి మార్షెంకోకు సంయుక్తంగా ప్రదానం చేశారు. ఆంగ్‌సాన్ సూచీ (1990), తస్లీమా నస్రీన్ (1994), కోఫీ అన్నన్ (2003), రిపోర్టర్‌‌స వితౌట్ బోర్డర్‌‌స అనే సంస్థ (2005), మలాలా యూ సఫ్ జాయ్ (2013)కు ఈ బహుమతి లభించింది.
 
 సఖరోవ్ ప్రైజ్-2014
 డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డెనిస్ ముక్‌వెగె 2014 సఖరోవ్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ఈ అవార్డును యూరోపియన్ పార్లమెంట్ నవంబర్‌లో జరిగే ఒక కార్యక్రమంలో ఆయనకు స్ట్రాస్ బర్‌‌గలో ప్రదానం చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement