మాదిరి ప్రశ్నలు | model questions | Sakshi
Sakshi News home page

మాదిరి ప్రశ్నలు

Sep 10 2013 10:28 PM | Updated on Sep 1 2017 10:36 PM

న్యూటన్ మూడు గమన నియమాల్లో.. ఏ నియమాన్ని జడత్వ నియమం అంటారు? ఎ) మొదటి బి) రెండో సి) మూడో డి) పైవన్నీ

 1.    న్యూటన్ మూడు గమన నియమాల్లో.. ఏ నియమాన్ని జడత్వ నియమం అంటారు?
     ఎ) మొదటి     బి) రెండో
     సి) మూడో     డి) పైవన్నీ
 
 2.    బైకు, కారు, బస్సులలో... దేని జడత్వం ఎక్కువ?
     ఎ) బైకు     బి) కారు
     సి) బస్సు      డి) పైవన్నీ
 
 3.    గమనంలో ఉన్న వస్తువుకు ఏ భౌతిక రాశి ఉంటుంది?
     ఎ) వేగం              బి) రేఖీయ ద్రవ్యవేగం
     సి) గతిజ శక్తి     డి) పైవన్నీ
 
 4.    బాంబు విస్ఫోటనం, తుపాకి పని చేయడంలో ఏ నిత్యత్వ నియమం ఇమిడి ఉంది?
     ఎ) న్యూటన్ మూడో గమన నియమం
     బి) రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
     సి) ద్రవ్యరాశి నిత్యత్వ నియమం
     డి) కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం
 
 5.    జడత్వం ప్రమాణం?
     ఎ) గ్రామ్     బి) కిలోగ్రామ్
     సి) పౌండ్     డి) పైవన్నీ            
 
 6.    అంతర్గత బలం వల్ల గమనంలో ఉన్న వస్తువు వేగం?
     ఎ) పెరుగుతుంది    బి) తగ్గుతుంది
     సి) మారదు
     డి) రెండింతలు అవుతుంది
 
 7.    ఏ ప్రక్షిప్త కోణం వద్ద ప్రక్షేపకం గరిష్టై వ్యాప్తిని పొందుతుంది?
     ఎ) 30ని     బి) 45ని
      సి) 90ని     డి) 120ని
 
 8.    బలం.. అంతర్జాతీయ ప్రమాణం?
     ఎ) న్యూటన్     బి) డైన్
     సి) కి.గ్రా., మీ/సె2
     డి) గ్రా., సెం.మీ/సె2
 
 9.    కింది వాటిలో అత్యంత గరిష్టమైన బలం?
     ఎ) అయస్కాంత బలం
     బి) ఘర్షణ బలం
     సి) గురుత్వాకర్షణ బలం
     డి) కేంద్రక బలం
 
 10.    ఎక్కువ ప్రాధాన్యతను కలిగిన న్యూటన్ గమన నియమం?
     ఎ) మొదటి     బి) రెండో
     సి) మూడో     డి) పైవన్నీ
 
 11.    {పక్షేపకం ఏ మార్గంలో ప్రయాణిస్తుంది?
     ఎ) రుజు     బి) వృత్తాకార
     సి) పరావలయ    డి) దీర్ఘవృత్తాకార
 
 12.    న్యూటన్ మూడో గమన నియమం ఆధారంగా పనిచేసేది?
     ఎ) రాకెట్     
     బి) క్షిపణి
     సి) యుద్ధ విమానం    డి) పైవన్నీ
 
 13.    ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాలవ్యవధిలో  ప్రయోగిస్తే దానిపై ప్రచో దన ప్రభావం?
     ఎ) పెరుగుతుంది     బి) తగ్గుతుంది
     సి) శూన్యం           డి) అనంతం
 
 14.    లిఫ్ట్‌ని కనుగొన్న శాస్త్రవేత్త?
     ఎ) న్యూటన్    
     బి) రూథర్‌ఫర్డ్
     సి) పాస్కల్      డి) ఓటిస్
 
 15.    పైకి కదులుతున్న లిఫ్ట్‌లోని వ్యక్తి చర్య, ప్రతి చర్యలు అనేవి?
     ఎ) సమానం     
     బి) చర్య ఎక్కువ
     సి) ప్రతిచర్య ఎక్కువ     
     డి) ప్రతిచర్య శూన్యం
 
 సమాధానాలు
  1)  ఎ;    2)  సి;    3) డి;     4) బి;
  5)  డి;     6)  సి;    7) బి;     8) ఎ;    
  9)  డి;     10) బి;     11) సి;   12) డి;    
  13) బి;     14) డి;     15) సి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement