బులెటిన్‌ బోర్డ్‌ | Sakshi
Sakshi News home page

బులెటిన్‌ బోర్డ్‌

Published Thu, Apr 6 2017 1:10 AM

Bulletin Board

ఐఐటీ మద్రాస్‌లో అసోసియేట్,       అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ–మద్రాస్‌(ఐఐటీ–ఎం)వివిధ విభాగాల్లో అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు: అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, అప్లైడ్‌ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్‌ డిజైన్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, ఓషన్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్‌.

అర్హతలు: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో పీహెచ్‌డీ లేదా తత్సమానమైన కోర్సు. అలాగే అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఇండస్ట్రియల్‌/రీసెర్చ్‌/టీచింగ్‌ విభాగంలో ఆరేళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మూడేళ్లు ఉద్యోగానుభవం ఉండాలి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల అభ్యర్థులు ఆరేళ్ల ఉద్యోగ కాలంలో కనీసం మూడేళ్లు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ /సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌/సీనియర్‌ డిజైన్‌ ఇంజనీర్‌గా
పనిచేసి ఉండాలి.

వయోపరిమితి: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 35 ఏళ్ల లోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: అభ్యర్థులుwww.iitm.ac.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని ప్రింటవుట్‌ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి కవర్‌లో ఉంచి ‘డీన్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఐఐటీ మద్రాస్, చెన్నై–600036’ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 23, 2017.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:  www.iitm.ac.in

Advertisement
Advertisement