breaking news
Professor post
-
బులెటిన్ బోర్డ్
ఐఐటీ మద్రాస్‌లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–మద్రాస్(ఐఐటీ–ఎం)వివిధ విభాగాల్లో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అప్లైడ్ మెకానిక్స్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ డిజైన్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఓషన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో పీహెచ్డీ లేదా తత్సమానమైన కోర్సు. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇండస్ట్రియల్/రీసెర్చ్/టీచింగ్ విభాగంలో ఆరేళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మూడేళ్లు ఉద్యోగానుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల అభ్యర్థులు ఆరేళ్ల ఉద్యోగ కాలంలో కనీసం మూడేళ్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ /సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్/సీనియర్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేసి ఉండాలి. వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు 35 ఏళ్ల లోపు ఉండాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులుwww.iitm.ac.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని ప్రింటవుట్ తీసుకొని సంబంధిత ధ్రువపత్రాల నకళ్లు జతచేసి కవర్లో ఉంచి ‘డీన్ (అడ్మినిస్ట్రేషన్), ఐఐటీ మద్రాస్, చెన్నై–600036’ చిరునామాకు గడువులోగా చేరేలా పంపాలి. దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 23, 2017. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iitm.ac.in -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ టెస్టు
ఉన్నత విద్యామండలికి బాధ్యత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో బోధనా పోస్టుల భర్తీకి‘స్క్రీనింగ్ టెస్టు’ పెట్టాలని వర్సిటీల ఉపకులపతులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలికి అప్పగించారు. బుధవారం విజయవాడలో వీసీల సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, వైస్ చైర్మన్లు పి.విజయప్రకాశ్, పి.నరసింహారావు, కమిషనర్ బి.ఉదయలక్ష్మి, మండలి కార్యదర్శి వరదరాజన్, 15 యూనివర్సిటీల వీసీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి స్కైప్ ద్వారా వీడియోలో మాట్లాడారు. వర్సిటీల్లో 1,104 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర స్థాయిలో కామన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలని,పరీక్ష బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించాలని మొదట భావించారు. దీనిపై వీసీలు, విద్యానిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో తాజా సమావేశంలో దీనిపై చర్చించారు. ఉన్నత విద్యామండలి ఇప్పటికే పలు కోర్సులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నందున అదే మాదిరి ఒక కన్వీనర్‌ను నియమించి ఈ ‘స్క్రీనింగ్ టెస్టు’ బాధ్యత అప్పగించాలని పలువురు వీసీలు సూచించారు.