సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 111 పోస్టులు | 111 posts in Central Water Commission | Sakshi
Sakshi News home page

సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 111 పోస్టులు

Sep 7 2016 12:18 AM | Updated on Sep 4 2017 12:26 PM

సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 111 పోస్టులు

సెంట్రల్ వాటర్ కమిషన్‌లో 111 పోస్టులు

నోయిడాలోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 111 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్‌డబ్ల్యూఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

నోయిడాలోని సెంట్రల్ వాటర్ కమిషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 111 స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్‌డబ్ల్యూఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
  పోస్టు: స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ (ఎస్‌డబ్ల్యూఏ)
  మొత్తం పోస్టులు: 111 (ఎస్సీ-13, ఎస్టీ-8, ఓబీసీ-34, జనరల్-56) ప్రతి విభాగంలో దివ్యాంగులకు 3 శాతం కేటాయిస్తారు.
 
  విద్యార్హత: మెట్రిక్యులేషన్/ఐటీఐ/తత్సమాన కోర్సు చదివి ఉండాలి.
 
  వయోపరిమితి: దరఖాస్తుకు తుది గడువు నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులకు నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది.  
 
  ఎంపిక విధానం: దరఖాస్తులను పరిశీలించి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఫిజికల్ టెస్ట్‌లకు ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు 25 పౌండ్ల బరువున్న చేపలను ఎత్తిపట్టుకుని ఆగకుండా 500 మీటర్లు తీసుకెళ్లాలి. అలాగే 8 అడుగులకంటే లోతైన నీళ్లలో ఆగకుండా 100 మీటర్లు ఈదగలగాలి. అభ్యర్థుల శారీరక సౌష్టవాన్ని పరిశీలించేందుకే వీటిని నిర్వహిస్తారు. వీటికి ఎలాంటి మార్కులు కేటాయించరు. ఫిజికల్ టెస్ట్‌లో విజయం సాధించినవారికి అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది.
 
  దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఏ4 పేపర్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తును పూర్తిచేసి.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అప్పర్ యమునా డివిజన్, సెంట్రల్ వాటర్ కమిషన్, బీ-5, కాళింది భవన్, తారా క్రిసెంట్ రోడ్, కుతుబ్ ఇన్‌స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ - 110016 అడ్రస్‌కు పంపాలి.
  దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 26
  వెబ్‌సైట్:http://www.cwc.nic.in/

Advertisement
 
Advertisement
Advertisement