కొత్త ఏలికలు! | Narendra Modi takes victory laps, taunts Congress on defeat | Sakshi
Sakshi News home page

కొత్త ఏలికలు!

May 18 2014 1:36 AM | Updated on Jul 29 2019 7:43 PM

పదేళ్లపాటు దేశాన్ని పాలించడం కాదు... బాధించడమే పనిగా పెట్టు కున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ... నరేంద్ర మోడీ రూపంలో వ చ్చిన జన సునామీలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది.

సంపాదకీయం: పదేళ్లపాటు దేశాన్ని పాలించడం కాదు... బాధించడమే పనిగా పెట్టు కున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ... నరేంద్ర మోడీ రూపంలో వ చ్చిన జన సునామీలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. ఆసేతు హిమాచలం ఒక్కటై బీజేపీని హృదయపూర్వకంగా ఆహ్వానించింది. సార్వత్రిక ఎన్నికల బరిలోకి ఎన్‌డీఏ కూటమిగా ప్రవేశించినా దాని సారథి బీజేపీకే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసేంత బలగాన్ని కానుకగా ఇచ్చిపంపింది. నరేంద్ర మోడీ అన్నట్టు ప్రజాస్వామ్యంలో శత్రువులుండరు. పోటీదారులే ఉంటారు. ప్రచారం ముగియడంతో విద్వేషమూ, ఎన్నికలు ముగియడంతో పోటీ సమాప్తం కావాలి.
 
 అటు తర్వాత అందరి దృష్టీ దేశాభివృద్ధిపైనా, సామాన్యుడి క్లేశాలు తీర్చడం పైనా ఉండాలి. ఈ సత్యాన్ని గమనించలేకపోబట్టే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకంటే అత్యంతదా రుణమైన ఫలితాలు కాంగ్రెస్‌కు దాపురించాయి. ఆ పార్టీ వ్యవహార శైలినీ, వరస కుంభకోణాల్లో అది కూరుకుపోయిన తీరునూ దేశ ప్రజలు ఎంతగా అసహ్యించుకున్నారో ఆ ఫలితాలు కళ్లకుకట్టాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆగ్రహంగా ఉన్న సీమాంధ్రులు మాత్రమే కాదు... పలు రాష్ట్రాల్లోని ఓటర్లు సైతం కాంగ్రెస్‌కు శూన్యంకాన్ని మిగిల్చారు. కపిల్ సిబల్, మీరాకుమార్, గులాంనబీ ఆజాద్, సుశీల్‌కుమార్ షిండే, జైపాల్‌రెడ్డి వంటి ఉద్దండులు ఎటో కొట్టుకుపోయారు. సల్మాన్ ఖుర్షీద్ అయితే డిపాజిట్ కూడా పోగొట్టుకున్నారు.
 
 నిజమైన విజేతలు విజయాన్ని తలకెక్కించుకోరు. హృదయంలో పొదువుకుంటారు. తమ బాధ్యతనూ, కర్తవ్యాన్ని గుర్తెరిగి మసులుకుం టారు. వ్యూహ ప్రతివ్యూహాలూ... ఎత్తుగడలూ ఎన్నికల సమరాంగణా నికే పరిమితంచేస్తారు. అయిదేళ్లకాలాన్ని ప్రజాసేవ చేసేందుకు అందివ చ్చిన అద్భుత అవకాశంగా భావిస్తారు. యూపీఏ నిర్వాకం ఫలితంగా దేశం అన్నివిధాలా దీనావస్థకు చేరుకుంది. నానాటికీ పైపైకి పోతున్న నిత్యావసరాల ధరలు, అడుగంటుతున్న ఉపాధి అవకాశాలు, మూతబ డుతున్న పరిశ్రమలు, చిక్కిపోతున్న సాగు రంగం ప్రజలను కలవరపెడుతున్నాయి. లక్షలమంది కార్మికులు వీధినబడ్డారు. పట్ట భద్రులైన ప్రతి ముగ్గురిలోనూ ఒకరు నిరుద్యోగేనని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆమధ్య లెక్కచెప్పింది. విద్యుదుత్పాదన వంటి మౌలిక సదుపాయాలు పడకేశాయి. గణాంకాలు ఎంత కప్పెట్టాలని చూస్తున్నా పేదరికం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. ఈ సమస్యలే కాంగ్రెస్‌ను హిందూ మహా సముద్రంలోకి విసిరికొట్టి బీజేపీని అధికార పీఠం దరి చేర్చాయి. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశ ప్రజలకు ఎన్నో వాగ్దా నాలు చేసింది. వృద్ధిని పునరుద్ధరిస్తామని, ద్రవ్యోల్బణాన్ని కట్టడిచేస్తా మని, ‘బ్రాండ్ ఇండియా’ను సృష్టిస్తామని హామీలిచ్చింది. ముఖ్యంగా పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపుతామన్న ఆ పార్టీ హామీ మధ్యతరగతిని ఎంతగానో ఊరించింది.
 
 అత్యంత అధ్వాన్నంగా అఘోరించిన కేంద్ర - రాష్ట్ర సంబంధాలను ప్రజాస్వామీకరిస్తామని తెలిపింది. అధికారం చేప ట్టడానికి అవసరమైన ‘మేజిక్ ఫిగర్’ 272కాగా, బీజేపీకి 285 స్థానాలను కట్టబెట్టడానికి, ఆ పార్టీ సారథ్యంలోని ఎన్‌డీఏకు గంపగుత్తగా 339 స్థానాలివ్వడానికి కారణం జనం ఇలాంటి వాగ్దానాలన్నిటినీ విశ్వసిం చబట్టే. వచ్చే 60 నెలలపాటూ కూలీ నెంబర్ 1గా దేశాభివృద్ధికి అహర్నిశలూ కృషిచేస్తానని నరేంద్ర మోడీ అంటున్నారు.  ఏ ఒక్క పార్టీ ప్రభుత్వంగానో కాక దేశ ప్రజలందరికీచెందిన ప్రభుత్వంగా రూపుది ద్దుతామంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ‘భారత్ విజయం సాధించింద’ని మోడీ ట్వీట్ ఇచ్చారు. అది ఆచరణాత్మకం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
 
 మరికొన్ని రోజుల్లో రెండు రాష్ట్రాలుగా విడివడి మనుగడ సాగిం చనున్న తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలూ జరిగాయి. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడానికి ఉద్యమించిన కేసీఆర్‌వైపే తెలంగాణ ప్రాంతం మొగ్గింది. ఈ కల సాకారం కావడంలో తమ వంతు వాటా గురించి ఎవరెంత గొంతు చించుకున్నా వారిది అరణ్యరోదనే అయింది. బ్యాలెట్ పోరు మొత్తం ‘వన్ మాన్ షో’గా నడిచింది. అలాగని కేసీఆర్ కేవలం ఉద్యమ విజయగానానికే పరిమితం కాలేదు. జన సంక్షేమం కోసం తాము చేపట్టదలుచుకున్న కార్యక్రమాలను ఆవిష్కరించారు. బలహీన వర్గాల కోసం రెండు బెడ్‌రూంల పక్కా ఇళ్లు నిర్మిస్తామని, వచ్చే అయిదేళ్లలో దళితుల సంక్షేమానికి రూ. 50,000 కోట్లు, బీసీల సంక్షేమానికి రూ. 25,000 కోట్లు ఖర్చుచేస్తామని వాగ్దానం చేశారు. రైతాంగానికి రుణ మాఫీ ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల్లో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని ఖరారుచేశాయి. అటు సీమాంధ్రలో నరేంద్రమోడీ-బాబు-పవన్ కల్యాణ్ కూటమి... ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌పై హోరాహోరీ పోరాడింది.
 
 విజయం కోసం తప్పుడు ఆరోపణలకూ, వ్యక్తిగత నిందలకూ దిగింది. సర్వశక్తులూ ఒడ్డింది. రైతాంగానికి రుణమాఫీవంటి వాగ్దానాలు చేసింది. అధికారమైతే అందుకోగలిగినా ఇంతాచేసి ఆ కూటమి  వైఎస్సార్ కాంగ్రెస్ కంటే అదనంగా పొందింది 2.06 శాతం అదనపు ఓట్లు మాత్రమే. కొత్తగా అధికారం చేపట్టబోయే పక్షాలు తమ వాగ్దానాల్లో ఎన్నిటిని నెరవేరుస్తాయో, ఎంత సమర్ధవంతమైన పాలన అందించ గలుగుతాయో గమనిస్తూ... హామీల అమలుకు ఒత్తిడి తెచ్చే బాధ్య తనూ, అవసరమైతే ప్రజలపక్షాన ఉద్యమించే కర్తవ్యాన్నీ నెరవేర్చ వలసినది ఆయాచోట్ల ప్రతిపక్షంగా ఉంటున్నవారిదే.  కేంద్రంలో అధి కార పగ్గాలు చేపట్టనున్న నరేంద్రమోడీకి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్, చంద్రబాబులకు శుభాకాంక్షలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement