ఆత్మకూరు రూరల్ : పట్టణంలోని శివాలయం వీధిలో నివసిస్తున్న పువ్వాడి మాధవి అనే మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును చోరీ చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
బంగారు సరుడు చోరీ
Jul 22 2016 12:03 AM | Updated on Sep 4 2017 5:41 AM
ఆత్మకూరు రూరల్ : పట్టణంలోని శివాలయం వీధిలో నివసిస్తున్న పువ్వాడి మాధవి అనే మహిళ మెడలోని నాలుగు సవర్ల బంగారు సరుడును చోరీ చేసిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఆత్మకూరు పోలీసుల వివరాల మేరకు.. శివాలయం వీధిలో ఉంటున్న శ్రీనివాసులు, మాధవిలు బుధవారం రాత్రి తమ ఇంటి వరండాలో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మెడలోని నాలుగు సవర్ల సరుడును లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో వారు పరారయ్యారు. బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై ఎం.పూర్ణచంద్రరావు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement