ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి ఆరోపించారు.
పుట్టపర్తి టౌన్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి ఆరోపించారు. స్థానిక సాయి ఆరామంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణారెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఓబులపతి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ రంగానికి చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారం చేపట్టాక వాటిని విస్మరించారన్నారు. ఉపాధ్యాయులకు రెండు డీఏలను ఇవ్వలేదన్నారు.
డీవైఈఓ, డైట్ లెక్చరర్, ఎంఈఓ ఖాళీలను భర్తీలో నిర్లక్ష్యధోరణి అనుసరిస్తున్నారని విమర్శించారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, కార్పొరేట్ వైద్యశాలల్లో నగదు రహిత వైద్యం అందజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవీ సుబ్బా రెడ్డికి మద్దతు తెలపాలని ఉపాధ్యాయులను కోరారు. ఫెడరేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, నాయకులు ఫల్గుణ ప్రసాద్, పవన్‌కుమార్, మల్లోబులు , ప్రకాష్‌రెడ్డి, చెన్నారెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.