'నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా' | ysrcp mla gurunathreddy says allegetions against him baseless | Sakshi
Sakshi News home page

'నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా'

Mar 26 2016 1:40 PM | Updated on Oct 29 2018 8:48 PM

'నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా' - Sakshi

'నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా'

అనంతపురం జిల్లాలోని మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు.

అనంతపురం: అనంతపురం జిల్లాలోని మిస్మమ్మ భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ  ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో తన కుటుంబం అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని  గురునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన  సవాల్ విసిరారు.

మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే వరదాపురం సురి అక్రమాల చిట్టా ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్టు తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణం ఉన్నంతవరకు జగన్‌ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement