మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ | ysrcp mla alla ramakrishna reddy receives warning letter | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే ఆర్కేను మంగళగిరిలోనే చంపేస్తాం’

Sep 12 2016 1:39 PM | Updated on Oct 9 2018 5:11 PM

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ - Sakshi

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ‍్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది.

గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ‍్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోమవారం ఆగంతకుల నుంచి  బెదిరింపు లేఖ వచ్చింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టుకు వెళితే చంపుతామని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోనే ఆర్కేను చంపేస్తామని బెదిరింపులతో పాటు, అసభ్య పదజాలంతో ఆ లేఖలో హెచ్చరించారు.  తనకు వచ్చిన బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఆర్కే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.  అయితే తనపై కేసు కొట్టేయాలంటూ  ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement