వైఎస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి: వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగానే వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని చెప్పారు. శనివారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్లుగా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామన్నారు.
రామచంద్రాపురం మండలం కుప్పం బాదురులో ప్రతిభా పురస్కారాలను అందజేశామన్నారు. ప్రతి విద్యార్థి డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకోవాలనీ, అందుకు తగ్గట్టుగా ప్రణాళిక బద్ధంగా చదవాలని వారు ఆకాంక్షించారు.