మక్కా మసీదులో క్రేన్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఖాదర్, ఫాతిమా కుటంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
మచిలీపట్నం: మక్కా మసీదులో క్రేన్ కూలిన ప్రమాదంలో మృతి చెందిన ఖాదర్, ఫాతిమా కుటంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. హజ్ యాత్రకు వెళ్లి మక్కా మసీదు ప్రమాదంలో ఖాదర్, ఫాతిమా మృతి చెందిన విషయం తెలిసిందే. మచిలీపట్నం పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ బుధవారం ఖాదర్, ఫాతిమ కుటుంబ సభ్యులను పరామర్శించి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హజ్ యాత్ర మృతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పబ్లిసిటీ కోసం పుష్కరాలలో మేకప్ వేసుకుని షూటింగ్ చేసి 30మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆయన విమర్శించారు. పుష్కరాల మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించిన చంద్రబాబు దేవుడి కోసం హజ్ యాత్రకు వెళ్లిన వారి మరణాలకు ఎందుకు స్పందించరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అనంతరం ఆయన కరగ్రహారం బయల్దేరారు.