వైఎస్ జగన్ కు మద్దతుగా మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు

Jagan kosam team members offers prayers at Macca - Sakshi

మక్కా :
ఆంధ్రప్రదేశ్లో విద్యనభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సాయం మరచిపోలేరు అనడానికి ఈ కార్యక్రమమే ఒక నిదర్శనం.  అందరూ ఉన్నత చదువులు చదువుకునే విధంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఎంతోమంది విద్యార్థులకు మంచి జీవితాన్ని ప్రసాదించింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ విద్య వరకూ చదువుకునేందుకు ఈ పథకం ద్వారా వైఎస్ అవకాశం కల్పించారు. ఈ పథకంతో ఉన్నత చదువులు చదువుకొని సౌదీ అరేబియాలోని పలు ప్రముఖ సంస్థల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తోన్న కొందరు ప్రవాసాంధ్రులు వైఎస్సార్ కుటుంబం మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మక్కాలో ఉండే కాబాలో ఫోటోలతో ప్రార్థన చేయడం నిషేధం ఉన్నా, ఆ రాజన్న ప్రవేశపేట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్తో చదువుకోని, జీవితంలో స్థిరపడ్డాము కాబట్టి గుండెల నిండా పెద్దాయనను నింపుకొని ప్రార్థనలు చేశాము అని  'జగన్ కోసం టీమ్' సభ్యుడు షేక్ సలీం చెప్పారు.

 'కులమత భేదం లేకుండా రాజశేఖర్ రెడ్డి తన పథకాలతో ఎందరినో చదివించారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ అభిమానమే మక్కా మసీదు వరకు వెళ్లి వైఎస్ జగన్ కోసం ప్రార్థనలు చేసేలా చేసింది' అని గుంటూరు జిల్లా వేమూరు నియోజక వర్గంకు చెందిన షేక్ సలీం అన్నారు.  వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయబోయే పాదయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, అలాగే వైఎస్ జగన్కు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ ముస్లింలకు అత్యంతపవిత్ర స్థలమైన మక్కా మసీదులో 'జగన్ కోసం టీమ్' సభ్యులు ప్రార్థనలు నిర్వహించారని తెలిపారు.

వైఎస్ జగన్ కోరుకున్నట్టు ఈ పాదయాత్ర విజయవంతం కావాలని తన స్నేహితులతో కలిసి ముస్లింల ఆరాధ్య ప్రదేశం మస్జిద్ ఎ మక్కాలో ప్రత్యేకంగా ప్రార్ధనలు చేశామని షేక్ సలీం అన్నారు. పవిత్ర ఉమ్రా కూడా చేసి ఆ తరువాత తాము చేసిన అన్ని నమాజుల పుణ్యం మైనార్టీలకు తోడుగా నిలిచే జగన్కు దక్కాలని దువా చేసుకోనే కార్యక్రమం కూడా చేశామన్నారు. ఈ ప్రార్థనలు కూడా తనకు అత్యంత ఆప్తులైన మతగురువుల సలహాలను, సూచనలను తీసుకోని వారు చేప్పిన విధంగా భక్తి శ్రద్ధలతో అన్ని నియమనిబంధనలను, పద్దతులను పాటించి వైఎస్ జగన్కు మద్దతుగా ఉమ్రా చేశామన్నారు.

వైఎస్ జగన్ పాదయాత్రలో ఉన్నప్పుడు మరోసారి ప్రార్థనలు చేస్తామన్నారు. పవిత్రమైనా జమ్ జమ్ నీటిని, అజ్వా ఖర్జురపండును వైఎస్ జగన్ ను కలిసి అందిచే కార్యక్రమం త్వరలో చేస్తామని 'జగన్ కోసం టీమ్' తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, మహమ్మద్ షబ్బీర్, షేక్ సిరాజ్, మహమ్మద్ అల్తాఫ్, షేక్ ఖాజావలి, ఇర్షాద్, షేక్ ఫరీద్లతో పాటూ మరికొందరు పాల్గోన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top