ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ | YS Jagan Mohan Reddy attends iftar party in Kadapa | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్

Jul 5 2016 8:19 PM | Updated on Jul 25 2018 4:09 PM

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్ - Sakshi

ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

కడప: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు ఆయన కడపలోని అమీన్‌పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ఇమామ్ ఆరిపుల్లా హుస్సేన్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

అంతకుముందు అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పంచలోహ విగ్రహాల ప్రతిష్టాపన సందర్భంగా వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. 6వ తేదీన ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం వరకు పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు.



Advertisement
 
Advertisement
Advertisement