బెంగుళూరు నుంచి లక్నో వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్లో కలకలం రేగింది.
కాజీపూట: బెంగుళూరు నుంచి లక్నో వెళ్తున్న యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్లో కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆరుగురు యువకులు డ్రగ్స్ తీసుకొని రైల్లో హల్‌చల్ చేసి స్పృహ కోల్పోయారు. వారితో విసుగు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు కాజీపేట రైల్వే స్టేషన్ చేరుకోగానే ఆ ఆరుగురు యువకులను దింపి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. డ్రగ్స్ తీసుకున్నా యువకులు మాత్రం మాకు ఎవరో మత్తు మందు ఇచ్చి తమ వద్ద ఉన్న డబ్బులు తీసుకెళ్లారని చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.