సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి | youth mustbe first in charity | Sakshi
Sakshi News home page

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

Oct 3 2016 12:05 AM | Updated on May 24 2018 1:33 PM

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి - Sakshi

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సర్పంచ్‌ నకిరేకంటి స్వప్న

 వెల్లంకి (రామన్నపేట) : యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సర్పంచ్‌ నకిరేకంటి స్వప్న, ఎంపీటీసీ కూరెళ్ల నర్సింహాచారి కోరారు. ఆదివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో శివాజీయూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు. శిబిరంలో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో వైద్యులు సుబ్బారావు, నిర్మల, అనిత, వల్లందాసు కృష్ణ, వివిధ పార్టీల నాయకులు తాటిపాముల శివకృష్ణ, నకిరేకంటి అశోక్, నిర్వాహకులు కొయ్యలకొండ రాజు, దేశబోయిన శ్రీధర్, ఎర్రంబెల్లి రాజు, కందాల శివశంకర్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement