కొండమల్లేపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణ శివారులోని నల్లగొండ రోడ్డులో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
Oct 1 2016 10:59 PM | Updated on Apr 3 2019 7:53 PM
కొండమల్లేపల్లి :
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణ శివారులోని నల్లగొండ రోడ్డులో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధి గౌరికుంటతండాకు చెందిన ఇంద్రావత్ కళ్యాణ్ (17) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కళ్యాణ్ తన సోదరుడితో కలిసి రాత్రి తండా నుంచి కొండమల్లేపల్లి పట్టణానికి నడుచుకుంటూ కాలినడకన వస్తుండగా వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో కళ్యాణ్ తలకు తీవ్రగాయాలు కాగా అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి లాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సర్దార్ తెలిపారు.
Advertisement


