అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి | Women Died In suspicious Stage | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

Sep 8 2016 11:45 PM | Updated on Sep 4 2017 12:41 PM

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

కడప నగరం, టుటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి బళ్లారిరోడ్డులోని కేసీ కెనాల్‌ సమీపంలో షేక్‌ హబీబా (27) అనే మహిళ తమ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి మృతి చెందింది.

– భర్తే హత్య చేశాడని బంధువుల ఆరోపణ
కడప అర్బన్‌ : కడప నగరం, టుటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి బళ్లారిరోడ్డులోని కేసీ కెనాల్‌ సమీపంలో షేక్‌ హబీబా (27) అనే మహిళ తమ ఇంటిలో అనుమానాస్పద స్థితిలో గురువారం రాత్రి మృతి చెందింది. అర్బన్‌ సీఐ సదాశివయ్య తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. మృతురాలి బంధువులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హబీబాను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. హబీబాకు బిలాల్‌తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా భార్యాభర్తలమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు వెళ్లేసరికి ఆమె మృతదేహం పడకపై ఉంది. పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతురాలి భర్త బిలాల్‌ మాత్రం తన భార్య కిటికీకి నైలాన్‌ తాడుతో ఉరి వేసుకుందని, అది గమనించి తాను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందిందని తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డిలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement